ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్
జెఫ్బెజోస్ను మించి అగ్రస్థానానికి
188.5 బిలియన్ డాలర్లకు నికర సంపద
టెస్లా షేర్లు రాణించడంతోనే
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ
దిల్లీ: విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఇపుడు ప్రపంచం మొత్తం మీద అందరికన్నా ధనవంతుడు అయ్యారు. టెస్లా షేరు విలువ గురువారం 4.8 శాతం పెరగడం ఇందుకు దోహదం చేసింది. 500 మంది కుబేరులతో రూపొందే బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. గురువారం ఉదయం 10:15 గంటలకు (అమెరికా సమయం) ఎలాన్ మస్క్ నికర సంపద 188.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14.13 లక్షల కోట్ల)కు చేరింది. ఫలితంగా ఈ జాబితాలో అక్టోబరు 2017 నుంచి అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ అధిపతి జెఫ్బెజోస్ సంపద కంటే ఈ మొత్తం 1.5 బిలియన్ డాలర్లు ఎక్కువగా నిలిచింది. దీంతో స్పేస్ ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, దక్షిణాఫ్రికాలో జన్మించిన ఎలాన్ మస్క్ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలోకి చేరారు. టెస్లా షేరు గురువారం ఒక దశలో 7.4 శాతం పెరిగి, 811.61 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది కూడా.
ఏడాది వ్యవధిలో
ఏడాది వ్యవధిలోనే ఎలాన్ మస్క్ సంపద విలువ 150 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేగంగా ఇంతటి సంపద సృష్టించిన రికార్డు ఈయనదే. టెస్లా షేర్లు ఏడాది కిందటితో పోలిస్తే ఏకంగా 743 శాతం మేర దూసుకెళ్లడంతో ఈ రికార్డు సాధ్యమైంది. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ పేరిట, జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ ఎల్ఎల్సీ పేరిట ప్రైవేటుగా అంతరిక్ష పరిశోధన కంపెనీలను నిర్వహిస్తున్నారు.
బుధవారం నాటికి పరిస్థితి ఇదీ..
న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ షేర్ల ధరల ప్రకారం.. ప్రతి ట్రేడింగ్ రోజు ముగిశాక ప్రపంచ కుబేరుల నికర సంపదను బ్లూమ్బర్గ్ ప్రకటిస్తుంటుంది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి జెఫ్ బెజోస్ 184 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో 181 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బిల్ గేట్స్ (132 బి.డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (114 బి.డాలర్లు), మార్క్ జుకర్బర్గ్ (99.9 బి.డాలర్లు), ఝాంగ్ షాన్సన్ (93.4 బి.డాలర్లు), వారెన్ బఫెట్ (87.28 బి.డాలర్లు), లారీ పేజ్ (81.5 బి.డాలర్లు) ఉన్నారు. గురువారం ఉదయం ట్రేడింగ్లో టెస్లా షేర్ల దూకుడుతో తొలి రెండు స్థానాలు తారుమారయ్యాయన్నమాట.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
-
Movies News
Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
- Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
- ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే.. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకేనా?
- Nitish kumar: బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
- Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్