
గ్రీన్‌కార్డు నిరీక్షణకు తెర!
అమెరికా కాంగ్రెస్‌లో వలస విధాన సవరణ బిల్లు
వాషింగ్టన్: అమెరికా పౌరసత్వం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణుల కల ఇక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వలస విధానాల్లో సంస్కరణ దిశగా అమెరికా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఓ నూతన బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. చాలా ఏళ్లుగా అమెరికాలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న సుమారు 1.1 కోట్ల మందికి పౌరసత్వం కల్పించనున్నారు. దీనివల్ల వారు నిర్భయంగా జీవించనున్నారు. దీంతోపాటు అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డుల జారీలో ఒక్కో దేశానికి విధించిన పరిమితిని ఎత్తివేయనున్నారు. తద్వారా భారీ సంఖ్యలో ప్రవాసీయులకు అమెరికాలో శాశ్వతంగా నివసించే అవకాశం దక్కనుంది. దీంతోపాటు హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములూ ఉద్యోగం చేసుకునేలా ఈ బిల్లును ప్రతిపాదించారు. కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొంది అధ్యక్షుడు బైడెన్ సంతకం చేస్తే చట్టరూపం దాలుస్తుంది. దీనిద్వారా అమెరికాలోని వేల మంది భారతీయ ఐటీ నిపుణులకు లబ్ధి కలగనుంది. హెచ్-1బీ వీసాదారుల పిల్లలూ వారితో కలసి ఉంటూ అక్కడ ఉద్యోగాలు పొందడానికి ఈ బిల్లు వీలు కల్పించనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.