Updated : 29/03/2021 10:15 IST

ఆరేళ్ల బాలుడు.. కోట్ల ఏళ్ల శిలాజాన్ని కనుగొన్నాడు 

బ్రిటన్‌లో భారత సంతతి చిన్నారి ఘనత

లండన్‌: భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలుడు.. బ్రిటన్‌లో కోట్ల సంవత్సరాల నాటి శిలాజాన్ని కనుగొన్నాడు. పశ్చిమ మిడ్‌ల్యాండ్స్‌లోని తమ తోటలో తవ్వుతున్నప్పుడు అతడికి ఇవి కనిపించాయి.  ఈ బాలుడి పేరు సిద్దక్‌ సింగ్‌ ఝామత్‌. అందరూ ముద్దుగా సిద్‌ అని పిలుచుకుంటారు. అతడికి క్రిస్మస్‌ కానుకగా.. శిలాజాల అన్వేషణకు ఉపయోగపడే కిట్‌ లభించింది. వీటి సాయంతో శోధించడం మొదలుపెట్టాడు. ‘‘కీటకాలు, పురాతన మట్టి వస్తువులు, ఇటుకల వంటి వాటి కోసం తవ్వకాలు చేపట్టా. అప్పుడు కొమ్ములాంటి ఒక శిల నాకు దర్శనమిచ్చింది. అది జంతువుకు సంబంధించిన దంతం లేదా గోరు లేదా కొమ్ము అయి ఉంటుందని అనిపించింది. అయితే అది ఒక పగడపు దిబ్బ భాగమని ఆ తర్వాత తేలింది. దీన్ని ‘హార్న్‌ కోరల్‌’ అంటారు’’ అని ఆ చిన్నారి చెప్పాడు. ఆ శిలాజం గురించి తెలిశాక తాను ఆనందోత్సహాలకు లోనైనట్లు తెలిపాడు. సిద్‌ తండ్రి విష్‌ సింగ్‌.. ఫేస్‌బుక్‌లోని ఒక శిలాజ బృందంలో సభ్యుడు. కుమారుడు వెలికితీసిన శిలాజ వయసు, ఇతర వివరాలను ఆయన తన బృందం సాయంతో వెలుగులోకి తెచ్చారు. అవి లభించినచోట భారీగా సముద్ర నత్తలు, స్క్విడ్‌ వంటివాటిని కూడా సిద్‌ కనుగొన్నాడని విష్‌ సింగ్‌ చెప్పారు. అవి లక్షల సంవత్సరాల నాటివని తనకు అర్థమైందన్నారు. ఈ తవ్వకాల్లో వెలుగు చూసిన హార్న్‌ కోరల్‌ 25.1 కోట్ల నుంచి 48.8 కోట్ల సంవత్సరాల నాటిదని అంచనావేసినట్లు తెలిపారు. అది రుగోసా కోరల్‌ అయి ఉంటుందన్నారు. అప్పట్లో ఇంగ్లండ్‌.. పాంజియా అనే భారీ ఖండంలో భాగంగా ఉండేదని చెప్పారు. సముద్రం కింద ఉండేదని తెలిపారు.  

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని