- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Ts News: చివరి చూపూ గగనమే..
గల్ఫ్‌లో శవయాతనలు
మరణించాక తరలింపులో తీవ్ర జాప్యం
నెలలపాటు ఎదురుచూపులు
తల్లడిల్లుతున్న బాధిత కుటుంబాలు
ప్రభుత్వాల సాయం అంతంతే
ఈనాడు - హైదరాబాద్
* నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి వాసి ఒంటరి నర్సారెడ్డి సౌదీ అరేబియాలోని రియాద్‌లో నవంబరు 1న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆ సమాచారం తెలిసి తల్లి నర్సవ్వ, భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. శవం వస్తే చివరిచూపు చూడాలని భావించారు. విదేశాంగ, పాస్‌పోర్టు అధికారులను వేడుకున్నారు. హైకోర్టునూ ఆశ్రయించారు. నానా ప్రయాసల అనంతరం అయిదు నెలల తర్వాత మృతదేహం స్వగ్రామానికి చేరింది.
* కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లికి చెందిన ఉయ్యాల పరశురాములు 2020 మే 13న దుబాయ్‌లో మరణించారు. ధ్రువీకరణ పత్రాలు లేనందున శవాన్ని తరలించడం సాధ్యం కాదంటూ అక్కడే అంత్యక్రియలు పూర్తిచేసిన ప్రభుత్వం ఆయన మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇంటికి పంపింది. నిర్జీవంగానైనా చూసే అవకాశం దక్కలేదంటూ కుటుంబసభ్యులు మానసిక క్షోభకు గురయ్యారు.
ఈ రెండు కుటుంబాలే కాదు.. గల్ఫ్‌లో మరణించే తెలంగాణ కార్మికుల కుటుంబాలన్నింటిదీ ఇదే పరిస్థితి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో దేశంగానీ దేశం వెళ్లి దురదృష్టవశాత్తూ అసువులు బాసిన కార్మికుల చివరి చూపు కోసం కుటుంబ సభ్యులకు నానా యాతనలు తప్పడం లేదు.
గల్ఫ్‌లోని యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఖతార్ దేశాల్లో కరోనా కంటే ముందు ప్రతిరోజూ 10 నుంచి 15 మంది భారతీయులు కన్నుమూసేవారు. కరోనా తొలి దశ తర్వాత లక్షల మంది స్వదేశానికి తిరిగిరాగా, అతి తక్కువ మంది అక్కడికి వెళ్తున్నారు. ఎన్నో ఆటంకాలు అధిగమించి గల్ఫ్ చేరినా ఉద్యోగం దొరకడం కష్టమే. వేతనాలు పొందడానికీ ఇబ్బందులే. ఉద్యోగాలు పోతే అక్రమంగా నివసించాలి. ఈ పరిస్థితుల్లో గల్ఫ్‌లో కార్మికులు తీవ్ర భయాందోళనల మధ్య జీవిస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. స్వగ్రామాల్లో కుటుంబాల నుంచి ఒత్తిళ్లు, సమస్యల కారణంగానూ కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రమాదాలు, హత్యల వల్లా చనిపోతున్నారు. భారత విదేశాంగ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం 2014 నుంచి 2020 వరకు 3,500 మంది భారతీయులు గల్ఫ్‌లో మరణించారు. వారిలో తెలంగాణ వారు 1300 మందికిపైగా ఉన్నారు. పరిస్థితి దుర్భరంగా ఉన్నా, మృతదేహాల తరలింపు సమస్యకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదనే విమర్శలున్నాయి.
మృతదేహాల కోసం ఎదురుచూపులు
గల్ఫ్‌లో మరణించిన తర్వాత మృతదేహాలను స్వదేశానికి తరలించడం అతిపెద్ద సమస్యగా పరిణమించింది. సౌదీలో నిబంధనలు మరీ కఠినతరంగా ఉంటాయి. ఎవరైనా చనిపోతే శవపరీక్ష, విచారణ, దర్యాప్తులు.. ఇలా అనేక కారణాలతో ఆరు నెలల సమయం పడుతుంది. ఈలోగా తరలింపు సాధ్యం కాకపోతే ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు అక్కడే అంత్యక్రియలు చేసేస్తున్నాయి.
ఎన్నో కారణాలు
రాష్ట్రం నుంచి వెళ్లిన వారికి వీసాలు, పాస్‌పోర్టులు లేకపోవడం మృతదేహాల తరలింపునకు ప్రధాన అడ్డంకిగా మారింది. స్థానికంగా పేర్లు నమోదు కాకపోవడం, ఎలాంటి ధ్రువీకరణలు లేకపోవడం, విదేశాంగ శాఖ నుంచి సత్వరం సమాచారం రాకపోవడం, మరణాలకు కారణాలు.. సాక్ష్యాలు లేకపోవడం తదితరాలతో శవ పంచనామాల్లో జాప్యం జరుగుతోంది. ఈ సమయాల్లో రాయబార కార్యాలయాలు స్వదేశంలోని మృతుని బంధువుల నుంచి సమాచారం తీసుకొని అందించిన తర్వాత ఆ ప్రక్రియ పూర్తవుతోంది. తర్వాత స్థానిక రాయబార కార్యాలయం అధికారుల అఫిడవిట్‌తో గల్ఫ్ దేశాల నుంచి నిరభ్యంతర పత్రం జారీ అవుతుంది.
ఖర్చూ అధికమే..
నిబంధనల ప్రకారం మృతదేహాలను విమానంలో తరలించాలి. ఒక ప్రయాణికుడి వెంట దానిని కార్గో టికెట్‌పై పంపించాలి. చాలా మంది ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లడానికి ముందుకు రావడం లేదు. ఆయా దేశాల్లో ఎవరైనా మృతిచెందితే మృతదేహాలను నిల్వచేసే ఫ్రీజర్లు, ప్యాకింగ్, కార్గో రుసుం తదితరాలకు రూ. 1.50 లక్షల నుంచి రూ.2 లక్షల మేరకు చెల్లించాలి. రాయబార కార్యాలయాలు చెల్లించలేని పక్షంలో మృతుడి కుటుంబీకులు, స్నేహితులు వీటిని చెల్లించాలి. ఈ మొత్తాన్ని చెల్లించలేక కుటుంబీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరోనా విషాదం
ప్రస్తుతం కరోనాతోనే ప్రవాస కార్మికులు పలువురు మృతి చెందుతున్నారు. వ్యాప్తి భయం దృష్ట్యా వారి మృతదేహాలను స్థానికంగానే ఖననం చేస్తున్నారు. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు.
బాధిత కుటుంబాలకేదీ సాయం?
గల్ఫ్ దేశాల్లో తెలంగాణ కార్మికులు అనారోగ్యంతో మరణించినా, హత్యకు గురైనా, ఆత్మహత్య చేసుకున్నా ఎలాంటి పరిహారం అందడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి, అదీ వీసాలు, పాస్పోర్టులుంటేనే పరిహారం వస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కంపెనీల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. తెలంగాణ కార్మికులకు బీమా పథకం లేకపోవడం మరో లోటు. కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల ప్రవాసీ బీమా పథకాన్ని అమలు చేస్తున్నా, దాని కింద కార్మికులు నమోదు కావడం లేదు. నమోదు చేసుకున్న వారికీ అది రెండేళ్ల కాలమే వర్తిస్తుండటం, ఆ తర్వాత ప్రమాదాలు జరుగుతుండటంతో ఎక్కువ మంది లబ్ధి పొందడం లేదు.
కేరళలో మెరుగైన విధానం
కేరళ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రం నుంచి వెళ్లే ప్రతి కార్మికునికి బీమా సదుపాయం కల్పిస్తోంది. వీసాలు, పాస్‌పోర్టులతోపాటు కంపెనీల ధ్రువీకరణలు ఉన్న వారినే విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తోంది.
సమాచారం ఇస్తే సాయం
- చిట్టిబాబు, తెలంగాణ ప్రభుత్వ ప్రవాస విభాగం అధికారి
కార్మికులు విదేశాలకు వెళ్లే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీసా, పాస్‌పోర్టులతో పాటు ఇతర ధ్రువీకరణలు ఉంటేనే వెళ్లాలి. మరణించిన సమాచారం తెలిపితే తెలంగాణ ప్రభుత్వం తరఫున అక్కడి రాయబార కార్యాలయాలను సంప్రదిస్తున్నాం. వీలైనంత త్వరగా మృతదేహాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని ధ్రువీకరణ పత్రాలుంటే కంపెనీల నుంచి పరిహారం ఇప్పిస్తున్నాం. ఎక్కువ కేసుల్లో కుటుంబాలపై భారం పడకుండా చూస్తున్నాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి
మృతదేహాల తరలింపు సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. రాయబార కార్యాలయాలు ఇలాంటి వాటిపై స్పందించాలి. గల్ఫ్ దేశాల్లో ప్రవాసులపై సర్వే నిర్వహించి, అందరి వివరాలు నమోదు చేయాలి. ఎవరు మరణించినా కుటుంబ సభ్యులకు వెంటనే సమాచారం తెలిపేలా వ్యవస్థ ఉండాలి. కంపెనీలోనే మరణిస్తే పరిహారం ఇప్పించాలి లేదా పరిహారం చెల్లించేలా ఆయా దేశాలపై ఒత్తిడి తేవాలి. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కూడా అక్కడ ప్రతినిధులను ఏర్పాటు చేయాలి. కేరళ ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం విధానం చేపడితే బాధిత కుటుంబాలకు ఊరట చేకూరుతుంది.
-శేఖర్‌గౌడ్, యూఏఈ, గల్ప్ కార్మికుల రక్షణసమితి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Viral Video: ఇద్దరు వైద్యుల డ్యాన్స్.. ఇప్పుడు నెట్టింట హల్చల్
-
General News
Chandrababu: విజన్-2047.. చంద్రబాబు చేసిన 10 సూచనలివే!
-
Movies News
Telugu movies: ఈ వారం వచ్చేవన్నీ చిన్న చిత్రాలే..! మరి ఓటీటీ మాటేంటి?
-
India News
Flight: గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
-
India News
indigenous howitzer: ఎర్రకోట వద్ద గర్జించిన స్వదేశీ శతఘ్నులు..!
-
Movies News
Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం