Published : 05/06/2021 11:32 IST

Vaccine: స్వల్ప సాయం.. పెద్ద వ్యూహం

మన దేశానికి అమెరికా నుంచి వచ్చేది పది లక్షల టీకా డోసులే!

దిల్లీ: తమ వద్ద మిగిలిపోయే 8కోట్ల టీకా డోసులను వివిధ దేశాలకు సరఫరా చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన ప్రకటన ఆకర్షణీయంగా కనిపిస్తున్నా దాని వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. పేద దేశాల ప్రజలకు నేరుగా కలిగే ప్రయోజనం కన్నా టీకా దౌత్యం ద్వారా వ్యూహాత్మక లబ్ధిని పొందేందుకే బైడెన్‌ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని అంటున్నారు. బైడెన్‌ నిర్ణయం వెలువడిన వెంటనే ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌తో భారత ప్రధాని మోదీ టెలిఫోన్‌లో సంభాషించడం, కృతజ్ఞతలు తెలపడం తెలిసిందే. అదే విధంగా మెక్సికో, గ్వాటెమాలా అధ్యక్షులతోనూ కమల మాట్లాడారు. అవసరాలకు మించి టీకాలను అమెరికా పోగేసుకుందనే విమర్శలు అధికమవుతున్న నేపథ్యంలో బైడెన్‌ ఇతర దేశాలకు వాటిని పంపిణీ చేస్తామని ప్రకటించారు. అమెరికా సరఫరా చేసే 8 కోట్ల టీకా డోసుల్లో తొలి విడతలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలకు పంపిణీ అయ్యేది 2.5 కోట్ల డోసులే. వీటిలో దక్షిణ, మధ్య అమెరికాకు 60 లక్షలు, ఆసియా దేశాలకు 70 లక్షలు, ఆఫ్రికా దేశాలకు 50లక్షలు...మరో 60 లక్షల డోసులు మెక్సికో, కెనడా, దక్షిణ కొరియా, పాలస్తీనాలకు కేటాయించారు. దక్షిణ, ఆగ్నేయ ఆసియాకు సరఫరా చేసే 70 లక్షల టీకాల్లో మన దేశానికి లభించబోయేది పది లక్షల డోసులు మాత్రమేనని దిల్లీ యూనివర్సిటీ కళాశాలకు చెందిన ప్రొఫెసర్, విదేశీ వ్యవహారాల విశ్లేషకుడు కుమార్‌ సంజయ్‌ సింగ్‌ తెలిపారు.

అక్కడ వద్దన్నవే ఇతరులకు...

 ‘ప్రపంచ దేశాలకు అమెరికా వాగ్దానం చేసిన 8 కోట్ల టీకా డోసుల్లో 6 కోట్ల డోసులు ఆస్ట్రాజెనెకా కంపెనీ(కొవిషీల్డ్‌) తయారు చేసినవే. అమెరికాలో మూడు కంపెనీల (ఫైజర్‌ బయోఎన్‌ టెక్, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌) టీకాలకు మాత్రమే అనుమతులు లభించాయి. ఆస్ట్రాజెనెకా టీకాకు అత్యవసర అనుమతులు రాకపోవడంతో 6 కోట్ల డోసులు అలాగే మిగిలిపోయాయి. మిగిలిన 2 కోట్ల డోసులు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఉత్పత్తి చేసినవి. అమెరికాలోనూ వీటి వినియోగానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రయోగ దశలోనే డబ్బు చెల్లించి ఆయా సంస్థల టీకాలను కొనుగోలు చేసినందున మిగిలిపోతున్న వాటినే ఇప్పుడు ఇతర దేశాలకు అమెరికా పంపిణీ చేయనుంది’  అని ప్రొఫెసర్‌ సంజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. తన వద్ద ఉన్న మిగులును వదిలించుకుంటూనే అమెరికా టీకా దౌత్యాన్ని చాకచక్యంగా నిర్వహించిందని తెలిపారు. అమెరికా టీకా సాయం వల్ల ప్రపంచ దేశాలకు ముఖ్యంగా భారత్‌కు కలిగే లబ్ధి చాలా తక్కువేనని ఆయన విశ్లేషించారు.

కొవిడ్‌ ఔషధ ప్రయోగాల్లో భారత పరిశోధకులకూ స్థానం: ఫౌచీ

వాషింగ్టన్‌: అత్యంత భద్రత, సామర్థ్యం కలిగిన కొవిడ్‌ చికిత్సావిధానాలను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఔషధ క్లినికల్‌ ప్రయోగాల్లో భారత పరిశోధకులనూ కలుపుకొని వెళ్తామని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ తెలిపారు. భారత్‌లోని అలెర్జీ, అంటువ్యాధుల విభాగాలతో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం అమెరికా సంస్థలకు ఉందని యుఎస్‌-ఇండియా వ్యూహాత్మక,భాగస్వామ్య వేదిక నిర్వహించిన ఓ కార్యక్రమంలో పౌచీ పేర్కొన్నారు. సార్స్‌కోవ్‌-2 వ్యాక్సిన్లపై పరిశోధనలను రెండు దేశాలూ భవిష్యత్తులోనూ కొనసాగిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.   

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని