Updated : 25/06/2021 11:15 IST

VISA: తిరస్కరణకు గురైనా మళ్లీ దరఖాస్తు..

హెచ్‌-1బి ఆశావహులకు ఊరట

వాషింగ్టన్‌: హెచ్‌-1బి వీసా ఆశావహులకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ సేవల (యూఎస్‌సీఐఎస్‌) సంస్థ శుభవార్త చెప్పింది! 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వీసా దరఖాస్తు ఇప్పటికే తిరస్కరణకు గురైనప్పటికీ.. మళ్లీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కొంతమంది విదేశీ ఉద్యోగ నిపుణులకు కల్పించనున్నట్లు ప్రకటించింది. ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. 2020 అక్టోబరు 1 తర్వాత వీసా ప్రారంభ తేదీని పరిగణించాలని విన్నవించిన పలువురి దరఖాస్తులను తాము తిరస్కరించిన సంగతిని యూఎస్‌సీఐఎస్‌ గుర్తుచేసింది. అలా తిరస్కరణకు గురైనవారు ఈ ఏడాది అక్టోబరు 1లోగా మళ్లీ తమ దరఖాస్తును సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని