ఉన్నత విద్యకు.. చలో విదేశాలకు!
కరోనా సమయంలోనూ విద్యార్థుల తాకిడి
సాధారణ రోజులతో పోల్చితే పెరుగుదల
ఈనాడు, హైదరాబాద్: విదేశీ వర్సిటీల్లో సింహభాగం ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభం కానుండటంతో విదేశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఉవ్విళ్లూరుతున్నారు. ఉస్మానియా పరిధిలో గతేడాది 7138 మంది ట్రాన్స్‌స్క్రిప్టులు (మార్కుల ధ్రువీకరణ పత్రాలు) తీసుకోగా.. ఈఏడాది ఇప్పటివరకు 4,314 మంది తీసుకోవడమే దీనికి నిదర్శనం. జేఎన్టీయూ పరిధిలో గతేడాది 1.40 లక్షల మంది పొందగా.. ఈసారి ఇప్పటివరకు ఏకంగా 1.25 లక్షల మంది తీసుకోవడం గమనార్హం. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు ట్రాన్స్స్క్రిప్టులే కీలకం. వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్(వెస్) లేదా ఇతర ఏజెన్సీలతో వర్సిటీలు ధ్రువీకరించుకున్నాక విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తాయి.
ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం
మనదేశం నుంచి ఎక్కువగా అమెరికా, కెనడా, యూకే వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండటం, అధిక శాతం జనాభాకు టీకాలు వేయడంతో ఉన్నత విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. గతేడాది ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులకు తొలుత ఆన్లైన్లో తరగతులు ప్రారంభించినా.. ప్రత్యక్ష బోధనకు అనుమతించడంతో విద్యార్థులు విదేశీబాట పట్టారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఐపీఎంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకా కార్యక్రమం చేపట్టగా, 10 వేల మంది వేయించుకున్నారు. ‘‘ప్రస్తుతం మన దేశంలో ఉన్నత విద్యలో అస్థిరత కనిపిస్తోంది. అమెరికా సహా పలు దేశాల్లో వ్యాక్సినేషన్ కావడంతో వర్సిటీల్లో ప్రత్యక్ష బోధన జరుగుతోంది. ఉన్నత విద్యను పూర్తిచేసి త్వరగా ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులు విదేశాలకు వెళ్లడం మేలని భావిస్తున్నారు’’ అని ఓయూ మాజీ ఉపకులపతి రామచంద్రం విశ్లేషించారు. ఇంజినీరింగ్, బీకాం, బీబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియా, జేఎన్టీయూ పరిధిలో చివరి ఏడాది ఇంజినీరింగ్, ఇతర పరీక్షలు జరుగుతున్నాయి. అనంతరం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గతేడాదిని మించి ఈసారి ట్రాన్స్‌స్క్రిప్టులు తీసుకునే అవకాశం ఉందని ఓయూ పరీక్షల నియంత్రణ విభాగం అధికారి శ్రీరామ్ వెంకటేశ్ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vijay Deverakonda: ప్రమోషన్స్‌కి చెప్పులేసుకెళ్లడానికి కారణమదే: విజయ్ దేవరకొండ
-
India News
Nitin Gadkari: మేం చెప్తాం.. మీరు ఎస్ సర్ అనండి..!
-
Crime News
Hyderabad News: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్వేర్ ఉద్యోగి..
-
World News
Ukraine war: క్రిమియాకు విముక్తితోనే యుద్ధం ముగింపు: జెలెన్స్కీ
-
General News
Godavari: ధవళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
-
Movies News
Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!