వేలిముద్ర.. విదేశీయానానికి రాజముద్ర
పాస్‌పోర్టు జారీకి తప్పనిసరి కానున్న వేలిముద్రల పరిశీలన
రెండేళ్లుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న పోలీసులు
ఈ విధానంలో 116 మంది నేరచరితుల గుర్తింపు
ఈనాడు - హైదరాబాద్
పోలీసు కేసులు ఉన్నవారికి పాస్‌పోర్టులు ఇస్తే.. హాయిగా విదేశాలకు చెక్కేసి విచారణ నుంచి తప్పించుకోవచ్చు. అందుకే పాస్‌పోర్టు జారీకి పోలీసు విచారణ తప్పనిసరి. కాని చాలా సందర్భాల్లో ఇది సరిగా జరగదు. మాఫియా డాన్ అబూ సలేం ఉదంతమే ఇందుకు నిదర్శనం. కర్నూలు చిరునామాతో దరఖాస్తు చేసుకొని, కిందిస్థాయి సిబ్బందిని మచ్చిక చేసుకొని పాస్‌పోర్టు పొందిన అబూ సలేం అతని ప్రియురాలు మోనికా బేడి గ్రీస్ చెక్కేశారు. ఇకమీదట అలా కుదరదు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుల వేలిముద్రల ద్వారా వారి నేర చరిత్రను పరిశీలించబోతున్నారు. రెండేళ్లుగా నమూనా పద్ధతిలో ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తుండగా ఇక మీదట ప్రతి దరఖాసుదారుడి వేలిముద్రలనూ విశ్లేషించనున్నారు. తద్వారా నేర చరిత్ర ఉన్న వారికి పాస్‌పోర్టులు జారీ కాకుండా సమర్థంగా నిరోధించాలని భావిస్తున్నారు. గత రెండేళ్ళ కాలంలో రాష్ట్రంలో ఇలా వేలిముద్రల ద్వారా 116 మందిని గుర్తించి పాస్‌పోర్టులు రాకుండా అడ్డుకోగలిగారు.
రెండు, మూడు రోజుల్లోనే విచారణ పూర్తి
నేర చరిత్ర ఉన్నవారికి పాస్‌పోర్టులు ఇవ్వరు. అందుకే దరఖాస్తు చేసుకున్న తర్వాత పోలీసు విచారణ జరిపేది అందుకే. దరఖాస్తుదారుడి చిరునామా ప్రకారం స్పెషల్ బ్రాంచి పోలీసులు వ్యక్తిగతంగా కలిసి, చుట్టుపక్కల వారిని విచారిస్తారు. దాంతోపాటు తమవద్ద అందుబాటులో ఉన్న రికార్డులు పరిశీలిస్తారు. ఈ మేరకు పాస్‌పోర్టు కార్యాలయానికి నివేదిక పంపుతారు. గతంలో ఈ మొత్తం ప్రక్రియకు కనీసం 20 రోజులు పట్టేది. కానీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రెండు మూడు రోజుల్లోనే దీన్ని పూర్తి చేస్తున్నారు. ఒకవేళ దరఖాస్తుదారునికి ఏదైనా నేర చరిత్ర ఉన్నా, పోలీసు కేసులు ఉన్నా పాస్‌పోర్టు జారీ నిరాకరిస్తారు. దీనిపై విభేదిస్తే సదరు దరఖాస్తుదారుడు న్యాయస్థానం ద్వారా ప్రత్యేక అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే పాస్‌పోర్టు జారీ అంశంలో పోలీసు విచారణే కీలకమైంది. అందుకే విచారణకు వచ్చే సిబ్బందిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించి తద్వారా సానుకూల నివేదిక వచ్చేలా చూసుకుంటారు. ముఖ్యంగా నేర చరిత్ర ఉన్న వారు ఇలా ప్రయత్నిస్తుంటారు. దీన్ని నిరోధించే ఉద్దేశంతోనే పోలీసుశాఖ పాస్‌పోర్టు దరఖాస్తు దారుల వేలిముద్రలు పరిశీలించాలని భావిస్తోంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. దరఖాస్తుదారుల్లో కొంతమందిని ఎంపిక చేసుకొని వారి వేలిముద్రలను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఫింగర్‌ప్రింట్స్ బ్యూరోలో దాదాపు 6 లక్షల మంది నేర చరిత్ర గలవారి వేలిముద్రల నిల్వ ఉంది. గతంలో ఒక్కో వేలిముద్రనూ పరిశీలించాల్సి వచ్చేది. దాంతో పాస్‌పోర్టు దరఖాస్తుదారుల వేలిముద్రలు పరిశీలించడం సాధ్యమయ్యేది కాదు. కాని ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేసిన పాపిలోన్ పరిజ్ఞానం ద్వారా క్షణాల్లో వేలిముద్రలను విశ్లేషించగలుగుతున్నారు. దీని ద్వారా పాస్‌పోర్టు దరఖాస్తుదారుని వేలిముద్రలను విచారణ అధికారి వద్ద ఉన్న వేలిముద్రల ఉపకరణంపై ఉంచుతారు. తద్వారా దరాఖాస్తుదారుని ఇంటి వద్ద నుంచే ఫింగర్‌ప్రింట్ బ్యూరోలోని నిల్వతో సరిపోల్చుతారు. ఒకవేళ వీరికి నేర చరిత్ర ఉండి ఉంటే క్షణాల్లో తెలిసిపోతుంది. దాంతో నేరచరిత్ర ఉన్న వారికి పాస్‌పోర్టు రాకుండా సమర్థంగా అడ్డుకోవచ్చు. 2020లో 94, 2021 జూన్ వరకూ 22 మందిని ఇలా నేరచరితులను గుర్తించగలిగారు. ఇప్పటి వరకూ మొత్తం దరఖాస్తుల్లో కొద్దిమంది నుంచి మాత్రమే వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఇక మీదట ప్రతి ఒక్క దరఖాస్తుదారుడి వేలిముద్రలను ఇలానే పరిశీలించాలని భావిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే పాస్‌పోర్టు పరిశీలన మరింత పారదర్శకంగా మారుతుందనడంలో సందేహం లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Anupama Parameswaran: పబ్లిక్‌లో రాజమౌళి కాళ్లకు నమస్కరించిన అనుపమ
-
Politics News
Telangana News: అక్కడెందుకు సీఎం కేసీఆర్ పర్యటించలేదు?: కోదండరామ్
-
India News
Modi: మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!
-
Crime News
Telangana News: కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
-
Sports News
Team india: ఆ ఇద్దరిలో ఎవరిని తుదిజట్టులో ఆడిస్తారో.. : మాజీ క్రికెటర్
-
Politics News
Revanth Reddy: మునుగోడు పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!