ధరలు విమానం మోత!
రాష్ట్రం నుంచి అమెరికాకు వెళ్లేందుకు విమాన టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. యూఎస్‌లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఇది శరాఘాతంగా పరిణమించింది.
అమాంతం పెరిగిన అమెరికా టికెట్ రేట్లు
రూ.90 వేల నుంచి రూ.2.20 లక్షలకు చేరిక
యూఎస్ వెళ్లే విద్యార్థులపై భారం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రం నుంచి అమెరికాకు వెళ్లేందుకు విమాన టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. యూఎస్‌లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఇది శరాఘాతంగా పరిణమించింది. కరోనా పరిస్థితులతో పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండటం, మన దేశం నుంచి ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటం దీనికి ప్రధాన కారణంగా ఉంది.
కొవిడ్ వైరస్ రెండో దశ విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అమెరికా నుంచి మాత్రం విమానాల రాకపోకలు సాగుతున్నాయి. అదీ ఆ దేశ పౌరులు, విద్యార్థి వీసా ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తోంది. అమెరికాతోపాటు మనదేశంలోనూ కరోనా రెండో దశ తీవ్రత తగ్గుముఖం పట్టటంతో దిల్లీలోని రాయబార కార్యాలయంతోపాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలోని కాన్సులేట్ కార్యాలయాలను గడిచిన నెల నుంచి తెరిచింది. ఈ నెల చివరి వారం, ఆగస్టులో అక్కడి విశ్వవిద్యాలయాల్లో తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థి వీసాలను మాత్రమే జారీ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. భారీ సంఖ్యలో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలకు స్లాట్లను విడుదల చేసింది. హైదరాబాద్‌లో స్లాట్లు లభించని తెలుగు విద్యార్థులు దిల్లీ, ముంబయిలలో ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యారు. ఈదఫా అధిక శాతం విద్యార్థులకు వీసాలు లభించినట్లు సమాచారం.
దీంతో ఆ విద్యార్థులంతా అమెరికా వెళ్లేందుకు సన్నద్ధమవుతుండటంతో విమాన టికెట్లకు గిరాకీ ఏర్పడింది. ఇదిలా ఉంటే యూఎస్‌కు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్యా తక్కువగా ఉండటంతో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లేందుకు రూ.60 వేలుగా ఉండే ఎకానమీ తరగతి టికెట్ ధర ప్రస్తుతం రూ.90 వేల నుంచి రూ.2.20లక్షల వరకూ ఉంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా, ఖతార్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ ఇండియా నడుపుతున్న విమానాల్లో మాత్రమే టికెట్ ధర కొంచెం తక్కువగా రూ.90 వేలు ఉంది.
డెల్టాతో చిక్కులు
కరోనా డెల్టా రకం భారతదేశం నుంచి వచ్చేవారి ద్వారా సోకుతోందన్న అపోహలు విస్తృతంగా ఉండటంతో రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికా వెళ్లే విమానాల్లో అధిక శాతం దుబాయ్, దోహా, బ్రిటన్లలో ఏదో ఒక మార్గం నుంచి వెళుతుంటాయి. దుబాయ్, బ్రిటన్ దేశాలు భారతదేశం నుంచి అమెరికా వెళ్లే ప్రయాణికులకు ఆగేందుకు(ట్రాన్సిట్) అవకాశం లేకుండా గతంలో ఆంక్షలు విధించాయి. తాజాగా ఆ ఆంక్షలను ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగించటంతో ఎమిరేట్స్, ఎతిహాద్ సంస్థలు తమ సర్వీసుల రద్దును పొడిగించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్‌హామ్‌లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్‌లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్‌లో టూరిస్ట్‌గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్