Updated : 14 Aug 2021 09:44 IST

USA: బహుళ జాతుల దేశంగా అమెరికా.. తగ్గుతున్న తెల్లవారి జనాభా

ఆసియన్, హిస్పానిక్‌ల సంఖ్య పెరుగుదల

వాషింగ్టన్‌: అమెరికా క్రమేణా బహుళ జాతుల సమ్మిళిత దేశంగా రూపుదిద్దుకుంటోంది. గత దశాబ్దంగా శ్వేత జాతీయుల ఆధిక్యం తగ్గుతుండడంతో పాటు, ఇతర జాతీయుల సంఖ్య కూడా పెరుగుతోంది. గురువారం సెన్సస్‌ బ్యూరో విడుదల చేసిన జనాభా లెక్కల్లో ఈ విషయం వెల్లడయింది. 1790 నుంచి ఇక్కడ జనాభా లెక్కలను సేకరిస్తున్నారు.
తొలిసారిగా శ్వేత జాతీయుల సంఖ్య తగ్గింది. 2010లో వారి జనాభా 19.6 కోట్లు ఉండగా, తాజాగా 19.10 కోట్లు ఉంది. శాతాలవారీగా చూస్తే 63.7% నుంచి 57.8%కు తగ్గింది. అయితే మొత్తం జనాభాలో వారిదే ఆధిక్యం
* చాలా మంది తాము ఏదో ఒక జాతివారమని చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. తాము బహుళ జాతీయులమని భావిస్తున్నారు. అలాంటి వారి సంఖ్య 4.99 కోట్ల వరకు ఉంది.  
గత పదేళ్లలో పల్లెల్లో జనాభా తగ్గింది. మెట్రోపాలిటన్‌ నగరాల్లో విపరీతంగా పెరిగింది.  
* దేశంలో పిల్లల సంఖ్య బాగా తగ్గుతోంది. జనాభా వృద్ధి రేటు తగ్గడమే ఇందుకు కారణం. 18 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న పిల్లల సంఖ్య 2010లో 7.42 కోట్లు ఉండగా, ఇప్పుడు 7.31 కోట్లు ఉంది. 1.4%మేర తగ్గుదల కనిపిస్తోంది. దేశ జనాభాలో 22% మంది పిల్లలే.
18 ఏళ్లు దాటిన వయోజనుల జనాభా 23.7 కోట్ల నుంచి 26.1 కోట్లకు పెరిగింది. శాతాల వారీగా చూస్తే 76% నుంచి 78%కి చేరింది. 
ఆసియన్లు, స్పానిష్‌-మెక్సికో మూలాలు ఉన్న హిస్పానిక్‌ జాతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశ జనాభాలో 18.7% మంది హిస్పానిక్‌లే. మొత్తం 6.21 కోట్ల మంది ఉన్నారు. ఆసియన్ల సంఖ్య దశాబ్దం కాలంలో మూడొంతులు పెరిగింది. మొత్తం 2.4 కోట్ల మంది ఉన్నారు. 
అమెరికా మొత్తం జనాభా 33.14 కోట్లుగా నమోదయింది.  


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని