Published : 20 Aug 2021 14:58 IST

తెలుగు సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వజ్రోత్సవ వేడుకలు

సింగపూర్‌: భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా 5 ఖండాలలోని 30 దేశాల తెలుగు సంస్థల సహకారంతో ‘వజ్రోత్సవ భారతం’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. వంశీ ఇంటర్నేషనల్, వేగేశ్న ఫౌండేషన్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, రాజ్ కమల్ ఛారిటీస్(అమెరికా)సంయుక్త ఆధ్వర్యంలో దాదాపు 12 గంటల పాటు దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి జ్యోతి ప్రకాశనం చేసి ఈ అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సురేఖ దివాకర్ల ఆధ్వర్యంలో 10మంది గాయనీమణులు 75 దేశ భక్తి గీతాలను ఆలపించారు. మండలి బుద్ధ ప్రసాద్, సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, సాయి కుమార్, మాధవపెద్ది సురేష్, ప్రసాద్ తోటకూర, జీవీ నరసింహం, డా|| వంగూరి చిట్టెన్ రాజు, రత్న కుమార్ కవుటూరు తదితరులు తమ విలువైన సందేశాలను పంచుకున్నారు. 

కార్యక్రమంలో సరోజ కొమరవోలు, శ్రీలత మగతల, కల్నల్ కేఆర్‌కే మోహన్ రావు, లెఫ్టినెంట్ కల్నల్ భాస్కర్‌రెడ్డి, విజయ తంగిరాల, జయ పీసపాటి, తాతాజీ ఉసిరికల, దీపిక రావి, విక్రమ్, అనిల్ కుమార్ కందించర్ల, శివ ఎల్లపు, ఎమ్ వి వి సత్యనారాయణ, పృథ్వీరాజ్,  వెంకట సురేష్, వేదమూర్తి, ఎస్ డి సుబ్బారావు, వెంకప్ప భాగవతుల, వెంకటేశ్వరరావు తోటకూర, నూనె శ్రీనివాస్, సారథి మోటమర్రి, డాక్టర్ శ్రీదేవి, డోగిపర్తి శంకర్రావు, మధు, సుధామ రెడ్డి, పార్థసారథి, ధన్‌రాజ్‌ జనార్ధన్, డాక్టర్ కేఆర్‌ సురేష్ కుమార్, డాక్టర్ వెంకటపతి తరిగొప్పుల, వేణుగోపాల్ రెడ్డి బోయపల్లి, డాక్టర్ వ్యాస కృష్ణ బూరుగుపల్లి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ కపటపు, ఉపేంద్ర చివుకుల, శారద సింగిరెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆళ్ళ, డాక్టర్ శ్రీ రామ్ సొంటి, లక్ష్మీ రాయవరపు, గుణ ఎస్ కొమ్మారెడ్డి, లలితా రామ్, శ్రీదేవి జాగర్లమూడి, రమ వనమా, శారద కాశీవజ్ఝుల, డాక్టర్ హరి ఇప్పనపల్లి, రాజేష్ ఎక్కల, మల్లిక్ పుచ్చా, జయరామ్ ఎర్రమిల్లి, డాక్టర్ వెంకటా చారి, రాధిక మంగిపూడి, కళ్యాణి, సింగింగ్ స్టార్ విజయలక్ష్మి, హేమవతి, బి.వి.ఎల్.ఎన్. పద్మావతి, వి.కె. దుర్గ, మాధవీ రావూరు, సుజా రమణ, సుందరి టి.లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు, తెన్నేటి సుధా దేవి, శైలజ సుంకరపల్లి, తదితరులు పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ కార్యక్రమాన్ని నమోదు చేశారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని