కువైట్‌లో వరలక్ష్మి వ్రత వేడుకలు
తెలుగు కళా సమితి కువైట్ ఆధ్వర్యంలో అంతర్జాలం వేదికగా (జూమ్) ద్వారా వరలక్ష్మి వ్రత వేడుకలు జరిగాయి. కువైట్‌లోని వివిధ ప్రాంతాల్లోని ఆడపడుచులందరూ శుక్రవారం (ఆగస్టు 20న) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కువైట్: తెలుగు కళా సమితి కువైట్ ఆధ్వర్యంలో అంతర్జాలం వేదికగా (జూమ్) ద్వారా వరలక్ష్మి వ్రత వేడుకలు జరిగాయి. కువైట్‌లోని వివిధ ప్రాంతాల్లోని ఆడపడుచులందరూ శుక్రవారం (ఆగస్టు 20న) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏటా వరలక్ష్మి వ్రతం, దేవీ నవరాత్రులు వంటివి అందరూ కలిసి సందడిగా చేసుకునేవారు. కరోనా మహమ్మారి వల్ల ఈ ఏడాది సామూహిక కార్యక్రమాలు, పండగలు, పూజలు ఆగిపోవడంతో సభ్యులు ఒకింత నిరుత్సాహనికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జూమ్ వేదికగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు సమితి సభ్యులు.
ఉదయం 8.45 గంటలకు పంచసూక్తం, భక్తి పాటలతో కార్యక్రమం ప్రారంభమైంది. 9.20 గంటలకు తెలుగు కళా సమితి అధ్యక్షులు సాయి వెంకట సుబ్బారావు ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొంటున్న సభ్యులకు, పురోహితులు శర్మకు స్వాగతం పలికి పూజా కార్యక్రమాల బాధ్యతలను వారికి అప్పగించారు. వరలక్ష్మి పూజా విధానం, వాటికి కావలసిన సామగ్రి, పూజ విశిష్టతను పురోహితులు శర్మ అందరికీ వివరించారు. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టాలు నెరవేరాలని, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని ప్రార్థిస్తూ స్త్రీలు తమ ఇళ్లలో వరలక్ష్మి దేవిని కన్నులపండువగా అలంకరించారు. పంచభక్ష పరమాన్నాలను నైవేద్యంగా సమర్పించారు. వ్రతం ముగిసిన తర్వాత తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యురాలు సుధా దాసరి మహిళలను లలిత, విష్ణు సహస్రనామ పారాయణానికి ఆహ్వానించారు. ఇందులో 80 మందికి పైగా ఆడపడుచులు పాల్గొన్నారు. వరలక్ష్మి దేవికి మంగళ హారతులిచ్చి దేవి అనుగ్రహాన్ని పొందారు. ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరించిన సభ్యులందరికీ, తమ కార్యవర్గానికి తెలుగు కళా సమితి అధ్యక్షులు సాయి వెంకట సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి శ్రీవత్స, వర్ధని కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డాలస్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించారు. -
వాషింగ్టన్ డీసీలో ఘనంగా తానా (నరేన్ వర్గం) విజయోత్సవ సభ
తానా ఎన్నికల్లో డా.నరేన్ కొడాలి వర్గం నుంచి గెలిచిన అభ్యర్థులంతా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివారం (మార్చి 23న) సాయంత్రం వాషింగ్టన్ డీసీలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. -
సింగపూర్‌లో స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు
మార్చి 18న స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో నివసించే తెలుగు గాయకులు ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుకొన్నారు. -
NATS: డల్లాస్‌లో వైభవంగా నాట్స్ తెలుగు వేడుకలు
నాట్స్ తెలుగు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు డల్లాస్‌లోని పది వేల మందికిపైగా తెలుగువారు హాజరయ్యారు. -
లండన్‌లో సీబీఈ అవార్డు అందుకున్న తెలుగు బిడ్డ డా.కన్నెగంటి చంద్ర
నిజామాబాద్ జిల్లాలో జన్మించి లండన్‌లో స్థిరపడిన భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్ర ప్రతిష్ఠాత్మక ‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (సీబీఈ)’ పురస్కారాన్ని అందుకొన్నారు. -
Indra Nooyi: అమెరికాలో వరుస ఘటనలు.. భారత విద్యార్థులకు ఇంద్రానూయీ సూచనలు
అమెరికా (USA)లో ఉన్న భారత విద్యార్థులకు పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) పలు సూచనలు చేశారు. -
కూటమిని గెలిపిద్దాం.. రాష్ట్రాన్ని కాపాడుకుందాం: ఎన్ఆర్ఐల తీర్మానం
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు ఆదివారం సమావేశమయ్యారు. -
Indian origin Family: అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి
కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
జనసేన ఆవిర్భావ వేడుకల వేళ.. డల్లాస్‌లో జనసేన, తెదేపా, భాజపా ఆత్మీయ సమావేశం
డల్లాస్‌లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్‌కు చెందిన పలువురు హాజరయ్యారు. -
సింగపూర్‌లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
సింగపూర్‌లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. -
న్యూజెర్సీలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
శివుడికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ అగ్రరాజ్యంలో ఎన్నారైలు ముక్తకంఠంతో నినదించారు. -
న్యూజెర్సీలో ఓఎఫ్ భాజపా ఆధ్వర్యంలో ‘ఛాయ్‌పే చర్చ’
న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో ‘ఛాయ్ పే చర్చ’ నిర్వహించారు. -
బే ఏరియాలో ‘తెదేపా-జనసేన-భాజపా’కు చెందిన ఎన్ఆర్ఐల ఆత్మీయ సమావేశం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
అమెరికాలో మే 24-26 మధ్య టీటీఏ మహాసభలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) అగ్రరాజ్యంలో భారీగా మహాసభలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. -
సౌదీ అరేబియాలో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి సమావేశం
సౌదీ అరేబియాలోని జుబైల్‌లో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి భేటీ అయ్యింది. రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు ‘ఎన్నికల సన్నాహక ఆత్మీయ సమావేశం’ పేరిట ఈ భేటీ నిర్వహించారు. -
డెట్రాయిట్లో అట్టహాసంగా మహిళా దినోత్సవం
గ్లోబల్ తెలంగాణ సంఘం డెట్రాయిట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. -
తానా బోర్డు ఛైర్మన్‌గా డా.నాగేంద్ర శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ప్రతిష్ఠాత్మక బోర్డు ఛైర్మన్ పదవికి డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
డెట్రాయిట్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళల దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది. -
TDP - Janasena: షికాగోలో ఘనంగా తెదేపా - జనసేన ఆత్మీయ సమావేశం
తెదేపా, జనసేన నాయకులు షికాగోలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
TANA Foundation: తానా ఫౌండేషన్ ఛైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి ఎన్నికయ్యారు. -
Sporty Divas: ఇండో-గల్ఫ్ త్రోబాల్ ఛాంపియన్షిప్ విజేతగా అమెరికా జట్టు
బహ్రెయిన్‌లో నిర్వహించిన ‘ఇండో-గల్ఫ్ ఇంటర్నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్’లో అమెరికాకు చెందిన మహిళల జట్టు ‘స్పోర్టీ దివాస్’ విజేతగా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్