నీట మునిగిన న్యూయార్క్‌

ఇడా హరికేన్‌ ప్రభావంతో అమెరికాలోని న్యూయార్క్‌తోపాటు న్యూజెర్సీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ధాటికి గురువారం పలు సంఘటనల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో న్యూయార్క్‌లోనే 12 మంది మృతి చెందారు. కొన్నిచోట్ల ప్రజా రవాణాను ని

Updated : 03 Sep 2021 10:36 IST

న్యూజెర్సీలోనూ వర్ష బీభత్సం
26 మంది మృతి

న్యూయార్క్‌: ఇడా హరికేన్‌ ప్రభావంతో అమెరికాలోని న్యూయార్క్‌తోపాటు న్యూజెర్సీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ధాటికి గురువారం పలు సంఘటనల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో న్యూయార్క్‌లోనే 12 మంది మృతి చెందారు. కొన్నిచోట్ల ప్రజా రవాణాను నిలిపివేశారు. న్యూయార్క్‌లోని జాతీయ వాతావరణ సేవలకేంద్రం వరద ఉద్ధృతి దృష్ట్యా మొట్టమొదటిసారిగా అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లో ఓ జలాశయంలోకి ప్రమాదకరస్థాయిలో నీరు చేరడంతో స్థానికులను ఖాళీ చేయించారు. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ల్యారీ తుపాను అంతకంతకూ బలపడుతోందని, శనివారం కల్లా అది ఇడా స్థాయిలో తీవ్రరూపు దాల్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని