‘షిర్డీ సాయి గాయత్రి మహా మంత్ర జపం’లో పాల్గొనేందుకు ఆహ్వానం

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నివారణ కోసం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ‘కోటి శ్రీ షిర్డీ సాయి గాయత్రి మహామంత్ర జపం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. షిర్డీ సాయి పరబ్రహ్మ, గురు వాణి అమ్మ అనుగ్రహ ఆశీస్సులతో విశ్వసాయి ద్వారకామాయి శక్తిపీఠం ఆధ్వర్యంలో సాయి ఉపాసకులు, గురూజీ లక్ష్మోజీ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది.

Updated : 28 Sep 2021 08:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నివారణ కోసం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ‘కోటి శ్రీ షిర్డీ సాయి గాయత్రి మహామంత్ర జపం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. షిర్డీ సాయి పరబ్రహ్మ, గురు వాణి అమ్మ అనుగ్రహ ఆశీస్సులతో విశ్వసాయి ద్వారకామాయి శక్తిపీఠం ఆధ్వర్యంలో సాయి ఉపాసకులు, గురూజీ లక్ష్మోజీ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. 2021 అక్టోబర్‌ 14 నుంచి డిసెంబరు 18 వరకు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఏడేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఈ మహామంత్రాన్ని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వ్యక్తిగతంగా లేదా బృందంగా ఆన్‌లైన్‌ వీడియో చాట్‌ ద్వారా జపించాలని నిర్వాహకులు కోరారు. దేవాలయాల్లో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఈ మహా మంత్రాన్ని 9 సార్లు, 100 సార్లు, 1001 సార్లు.. ఇలా యథా శక్తి జపించవచ్చని తెలిపారు. ఎన్నిసార్లు జపించారో ఆ సంఖ్యను విశ్వసాయి యాప్‌లోగానీ, అధికారిక వెబ్‌సైట్‌ www.viswasaidwarakamai.orgలో గానీ పొందుపరచాలని కోరారు. ఈ మహామంత్ర జపం కార్యక్రమం జరిగినన్నాళ్లూ తమ శక్తిమేర అన్నదానం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఎంతమందికైతే దానం చేస్తారో ఆ సంఖ్యనూ వెబ్‌సైట్లో పేర్కొనాల్సిందిగా సూచించారు. మరిన్ని వివరాలకు విశ్వసాయి ద్వారకామాయి శక్తిపీఠం, ఆధ్యాత్మిక, ఆత్మజ్ఞాన, ప్రపంచశాంతి సేవా సంస్థ సేవకులు ఓం ప్రసాద్‌: 408 802 8674 (అమెరికా), ఉమ: 63630 16252 (భారత్‌), మాధవి 79786 05389 (భారత్‌), విశ్వసాయి ద్వారకామాయి 99080 49194 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని