శ్రీశ్రీ “మహాప్రస్థానం ప్రత్యేక సంచికల” ఆవిష్కరణ

ఫ్రిస్కో నగరంలో తెలుగు భాషాభిమాని, ప్రముఖ ప్రవాస భారతీయుడు డా. ప్రసాద్‌ తోటకూర అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగు భాషాభిమానులు మహాకవి  శ్రీశ్రీకి ఘన నివాళులు అర్పించారు.

Updated : 06 Oct 2021 13:37 IST

డల్లాస్‌, టెక్సాస్‌ : ఫ్రిస్కో నగరంలో తెలుగు భాషాభిమాని, ప్రముఖ ప్రవాస భారతీయుడు డా. ప్రసాద్‌ తోటకూర అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగు భాషాభిమానులు మహాకవి  శ్రీశ్రీకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డా. ప్రసాద్‌ తోటకూర స్వాగతోపన్యాసం చేశారు. మహాకవి శ్రీశ్రీ  జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలను, ఆయన కలం నుంచి వెలువడిన రచనలను గుర్తుచేశారు. శ్రీశ్రీ రచించిన ‘మహాప్రస్థానం’ ఒక గొప్ప కవితా సంకలనంగా చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. శ్రీశ్రీ ప్రపంచ వ్యాప్తంగా భాషాభిమానులను సంపాదించుకున్న వైనాన్ని వివరించారు. మహాప్రస్థానాన్ని శ్రీశ్రీ తన సన్నిహిత మిత్రుడు కొంపల్లె జనార్ధన్‌రావుకి అంకితం ఇవ్వడానికి గల కారణాలను వివరించారు. ఈ సందర్భంగా డా. ప్రసాద్‌ తోటకూర ‘అంకిత గీతం’ చదివారు. 

ఈ ప్రత్యేక సాహిత్య సమావేశంలో అనంత్‌ మల్లవరపు, ఎంవీఎల్‌ ప్రసాద్‌, డా. అరుణజ్యోతి కోల, రాజశేఖర్‌ సూరిభొట్ల, రావు కల్వాల, డా. విశ్వనాధం పులిగండ్ల, డా. నక్త రాజు, డా. రమణ జువ్వాడి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కిరణ్మయి గుంట, డా. శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ల, భాస్కర్‌ రాయవరం, శారద సింగిరెడ్డి, మురళి వెన్నం, డా.నరసింహారెడ్డి ఊరిమిండి, లెనిన్‌ వేముల, చంద్రహాస్‌ మద్దుకూరి, చినసత్యం వీర్నపు, రాజేశ్వరి ఉదయగిరి, డా. జగదీశ్వర్‌ పుదూర్‌, దయకర్‌ మాడ, విశ్వేశరరావు కంది, సరుష్‌ మానుకొండ, సింధు వేముల, శాంతా పులిగండ్ల, సుందర్‌ తురిమెల్ల, వెంకట్‌ ములుకుట్ల, సత్యన్‌ కళ్యాన్‌ దుర్గ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మహాప్రస్థానంలోని 40 కవితలను చదివి సభను ఉత్సహాపరిచారు. 

ఈ సమావేశం చివరలో ఇటీవలే విజయవాడలోని శ్రీశ్రీ ప్రింటర్స్‌ ఆధ్వర్యంలో రెండున్నర కిలోల బరువుతో ముద్రించిన శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక ప్రతులను ఆవిష్కరించారు. విజయవాడ సాహితీ మిత్రులు విశ్వేశ్వరావు, బండ్ల మాధవరావు, టి. శ్రీనివాసరెడ్డి నిర్వహించిన కార్యక్రమ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టామని, ఎంతో శ్రద్ధతో, ఉన్నత ప్రమాణాలతో కూడిన ఇలాంటి పుస్తకాన్నిశ్రీశ్రీ  ప్రింటర్స్‌ ప్రచురించడం అభినందనీయమని డా. ప్రసాద్‌ తోటకూర అన్నారు. డల్లాస్‌లోని కొంత మంది సాహితీ ప్రియులు ఆ పుస్తకాలను సొంతం చేసుకొని, 25 మహాప్రస్థానం ప్రతులను ఒకే ఆవిష్కరించడం సాహితీ జగత్తులో చరిత్ర అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ డా. ప్రసాద్‌ తోటకూర ధన్యవాదాలు తెలిపారు. 

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts