పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ

రాష్ట్రంలో రైతుల సహకారంతోనే ఇంజినీరింగ్ విద్య పురోభివృద్ధి చెందుతోందని మలినేని గ్రూపు ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్లు అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని మలినేని కళాశాలలో శనివారం తానా ప్రతినిధి జి. వెంకట్ జిల్లెళ్లమూడి, ఆయన భార్య అంజనీ కవిత కడియాల (మలినేని పూర్వ విద్యార్థిని) సాయంతో పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

Published : 09 Oct 2021 23:21 IST

పుల్లడిగుంట (వట్టిచెరుకూరు): రాష్ట్రంలో రైతుల సహకారంతోనే ఇంజినీరింగ్ విద్య పురోభివృద్ధి చెందుతోందని మలినేని గ్రూపు ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్లు అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని మలినేని కళాశాలలో శనివారం తానా ప్రతినిధి జి. వెంకట్ జిల్లెళ్లమూడి, ఆయన భార్య అంజనీ కవిత కడియాల (మలినేని పూర్వ విద్యార్థిని) సాయంతో పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్‌ పెరుమాళ్లు మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో విస్తారంగా నిర్మించిన ఇంజినీరింగ్ కళాశాలలకు అన్నదాతలు తమ పంట భూములు ఇచ్చారన్నారు. తమ కళాశాలకు మంచినీటి పైపులైను వేసేందుకు వింజనంపాడు కర్షకులు 23 ఎకరాలు ఇవ్వడంతో ఇబ్బందులు తొలిగాయని గుర్తుచేశారు. ఎంతోమంది అన్నదాతలు తమ పిల్లలను రూ లక్షలు వెచ్చించి ఇంజినీర్లుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చదివే ప్రతి విద్యార్థి రైతుల కృషిని గుర్తించి తాము బాగా చదువుకొని కళాశాలలు, పేద విద్యార్థులకు సాయపడాలన్నారు. ఈ సందర్భంగా తానా ప్రతినిధి వెంకట్ తల్లిదండ్రులు గోవిందమ్మ, తిరుపతయ్య చేతుల మీదుగా ప్రతిభావంత పేద విద్యార్థులకు 20 ల్యాప్‌టాప్‌లు అందజేశారు. వారిని మలినేని పెరుమాళ్లు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పుటూరి సీతామహాలక్ష్మి తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జెట్టి అప్పారావు, డైరెక్టర్లు దేవిసెట్టి శ్రీనివాస కుమార్, పాటిబండ్ల నాగేశ్వరరావు, అకాడమిక్ ఆచార్యులు జంపని కిశోర్‌ బాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts