కాన్సస్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

కాన్సస్‌ తెలుగు సంఘం (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సస్‌ సిటీ - TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.

Published : 10 Oct 2021 15:43 IST

కాన్సస్‌: కాన్సస్‌ తెలుగు సంఘం (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సస్‌ సిటీ - TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. దాదాపు వెయ్యి మంది తెలుగు వారు ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంతో మంది చక్కగా బతుకమ్మలను చేసుకొని వచ్చి మొదటి నుంచి చివరి వరకు తెలంగాణ జానపద పాటలకు, బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. దేవాలయ పూజారి నిర్వహించిన అమ్మవారి పూజతో సంబరాలు ఆరంభం అయ్యాయి. పెద్దవాళ్లతో పాటు చిన్న పిల్లలు, యువతులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. బతుకమ్మలన్నింటిలో బాగా అలంకరించిన మూడింటిని ఎంపిక చేసి బహుమతులు ఇచ్చారు.  బతుకమ్మలను నిమజ్జనం చేసి అందరూ ప్రసాదం పంచుకోవడంతో సంబరాలు ముగిశాయి. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన సంఘం కార్యవర్గ సభ్యులకు, స్పాన్సర్లకు సంఘం అధ్యక్షుడు టేకులపల్లి శరత్‌, ట్రస్ట్‌ ఛైర్మన్‌ శ్రీకాంత్ రావికంటి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని