Diwali: అమెరికాలో దీపావళి సెలవు?

వెలుగుల పండగ దీపావళిని అమెరికాలోనూ సెలవు దినంగా ప్రకటించాలని

Updated : 04 Nov 2021 13:00 IST

ప్రతినిధుల సభలో బిల్లు 

వాషింగ్టన్‌: వెలుగుల పండగ దీపావళిని అమెరికాలోనూ సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యురాలు కరోలిన్‌ బి మలోనే ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)లో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని ఆమె బుధవారం స్వయంగా వెల్లడించారు. ‘దీపావళి డే యాక్ట్‌’ బిల్లును సభలో ప్రవేశపెట్టడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండగను జరుపుకోవడం విశేషమని తెలిపారు. మహమ్మారి కొవిడ్‌19పై పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలోనూ ఈ పండగకు ప్రాధాన్యముందని పేర్కొన్నారు. దీపావళిని ఫెడరల్‌ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించాలని మలోనే కోరారు. భారతీయ అమెరికన్‌ రాజా కృష్ణమూర్తి సహా పలువురు యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులు, విదేశీవ్యహారాల కమిటీ ఛైర్మన్‌ గ్రెగరీ మీక్స్‌ తదితరులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రపంచానికి, ప్రజల జీవితాలకు వెలుగులు ప్రసాదించే దీపావళి పండగను ఫెడరల్‌ హాలిడేగా ప్రకటించడం ఎంతో సముచితంగా ఉంటుందని రాజా కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. 


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts