వంశీ వేగేశ్న సంస్థల సేవలు ప్రశంసనీయం

వంశీ వేగేశ్న సంస్థల సేవలు ప్రశంసనీయమని ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సంస్థ ప్రతినిధి రాధిక మంగిపూడి ప్రశంసించారు. ప్రముఖ

Published : 06 Nov 2021 15:43 IST

వంశీ వేగేశ్న సంస్థల సేవలు ప్రశంసనీయమని ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సంస్థ ప్రతినిధి రాధిక మంగిపూడి ప్రశంసించారు. ప్రముఖ రచయిత్రి, అంతర్జాతీయ కార్యక్రమాల వ్యాఖ్యాత రాధిక మంగిపూడి, లోరియల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సప్లయ్‌ చైన్ డైరెక్టర్ మంగిపూడి సాయి ప్రకాష్  దంపతులు, హైదరాబాద్ వేగేశ్న ఫౌండేషన్‌, వంశీ ఆశ్రమాన్ని సందర్శించారు. గత మూడు దశాబ్దాలుగా దివ్యాంగులకు, వృద్ధులకు, పేద కళాకారులకు ఈ సంస్థ చేస్తున్న సేవలను ఎంతగానో ప్రశంసించారు. ముఖ్యంగా ఒకే ప్రదేశంలో దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించడం, ఉచితంగా వారికి శస్త్ర చికిత్సలు చేయించడం ఎంతో ఉదాత్తమైనదని, తప్పకుండా ఈ సేవకు తాము కూడా సహకరిస్తామని, నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఆశ్రమంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, షిరిడి సాయి దేవాలయం, ఘంటసాల స్మృతి మందిరం దర్శించుకుని కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులిద్దరినీ, వంశీ వేగేశ్న సంస్థల అధ్యక్షులు శిరోమణి వంశీ రామరాజు, వంశీ మేనేజింగ్ ట్రస్టీ సుంకరపల్లి శైలజ ఆలయ మర్యాదలతో సత్కరించారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలలో ఇతర దేశాల నుండి వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు విచ్చేసి సహకరించడం తమకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని వంశీ రామరాజు ఆనందం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు