వైకుంఠ ప్రస్థానం అభివృద్ధికి ఎన్నారై శశికాంత్ విరాళం

మనిషి ప్రాణం పోయాక దేహాన్ని తరతమ భేదం లేకుండా, గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో శ్మశానవాటిక అభివృద్ధికి ఎన్నారై వల్లేపల్లి శశికాంత్‌ ముందుకొచ్చారు.

Published : 15 Nov 2021 22:24 IST

గుడివాడ: మనిషి ప్రాణం పోయాక దేహాన్ని తరతమ భేదం లేకుండా, గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో శ్మశానవాటిక అభివృద్ధికి ఎన్నారై వల్లేపల్లి శశికాంత్‌ ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలోని పుల్లలపాడులోని శ్మశాన వాటిక అభివృద్ధికి తన వంతు సాయం ప్రకటించారు. ఇప్పటికే శ్మశానవాటిక అభివృద్ధికి రోటరీ క్లబ్‌ కృషి చేస్తోంది. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఈ క్రమంలో రాజేంద్రనగర్‌కు చెందిన దివంగత వల్లేపల్లి సీతా రామమోహన రావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు వల్లేపల్లి శశికాంత్ పుల్లలపాటు వైకుంఠదామ అభివృద్ధికి రూ.30 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మొత్తంలో పది లక్షల రూపాయలతో నూతనంగా వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరో 20 లక్షల రూపాయలతో మార్చురీ గదిని నిర్మించాలని నిర్ణయించారు. మార్చురీ గది నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. దూర ప్రాంతం నుంచి బంధువుల వచ్చే వరకు మృతదేహాలను భద్రపరిచేందుకు పట్టణంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో శశికాంత్‌ మార్చురీ గది ఏర్పాటు చేయాలని భావించారు. శశికాంత్‌ను రోటరీ క్లబ్ నిర్వాహకులు జి.బాబూ శ్రీకర్, రావి శ్రీ హర్ష చౌదరి, టీఎన్ రాజశేఖర్ తదితరులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని