అమెరికాలో ఇంజినీరింగ్‌కే ప్రాధాన్యం
అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల్లో అత్యధికులు ఇంజినీరింగు విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే తీరు కనిపిస్తోంది. అమెరికాలో చేరేవారికి సంబంధించిన గణాంకాలను అక్కడి ప్రభుత్వం ఏటా నవంబరులో విడుదల చేస్తుంది.
అగ్రరాజ్యంలో చదివేవారిలో భారతీయులది రెండో స్థానం
తాజా గణాంకాల విడుదల
ఈనాడు - హైదరాబాద్
అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల్లో అత్యధికులు ఇంజినీరింగు విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే తీరు కనిపిస్తోంది. అమెరికాలో చేరేవారికి సంబంధించిన గణాంకాలను అక్కడి ప్రభుత్వం ఏటా నవంబరులో విడుదల చేస్తుంది. గడిచిన వారం స్థూల సమాచారాన్ని, తాజాగా మరిన్ని గణాంకాలను విడుదల చేసింది. అమెరికా చదువులపై కరోనా తీవ్రప్రభావాన్ని చూపింది. ఈకారణంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాలను మూసివేయడంతో పాటు అంతర్జాతీయ సరిహద్దులపై ఆంక్షలు విధించడంతో చదువుకునేందుకు వెళ్లే యువత తీవ్ర ఇబ్బందులకు గురైంది. గత ఏడాదితో పోలిస్తే 2020-21 విద్యాసంవత్సరంలో సుమారు 15 శాతం మంది విద్యార్థులు తగ్గారు. 2019-20లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,93,124 మంది చేరితే, 2020-21లో ఆ సంఖ్య 1,67,582కు తగ్గింది.
కాలిఫోర్నియాలోనే అత్యధికులు
అమెరికాలో అత్యధికులు కాలిఫోర్నియా రాష్ట్రంలో చదువుకుంటున్నారు. 2020-21 విద్యాసంవత్సరంలో 1,32,758 ఇక్కడే ఉన్నారు. రెండో స్థానంలో న్యూయార్క్ నిలువగా.. ఇక్కడ 1,06,894 మంది విద్యార్థులు ఉంటున్నట్లు తేలింది. తర్వాత స్థానంలో టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఒహియో, మిచిగాన్ రాష్ట్రాలున్నాయి. అతితక్కువగా ఇండియానా రాష్ట్రంలో 23,948 మంది చదువుతున్నారు. విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో 17,050 మంది చేరారు. బోస్టన్‌లోని నార్త్ ఈస్ట్రన్ విశ్వవిద్యాలయం, న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిదాలయం, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఇలా మరో 15 విశ్వవిద్యాలయాలకు ప్రాధాన్యమిస్తున్నారు. అతి తక్కువగా ఒహియో స్టేట్ యూనివర్సిటీ 6,665 మంది చేరారు.
తరువాత కంప్యూటర్ సైన్స్, గణితం..
అమెరికాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంజినీరింగ్‌లో 1,90,590 మంది చేరారు. తరువాత స్థానంలో గణితశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ కోర్సులున్నాయి. వీటిలో 1,82,106 మంది చేరారు. ఇక వీటి తర్వాత బిజినెస్ మేనేజ్‌మెంట్, సామాజికశాస్త్రాలు, ఫిజికల్ అండ్ లైఫ్ సైన్స్‌స్, ఫైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్, ఆరోగ్య వృత్తులు, కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎడ్యుకేషన్, ఇంటెన్సివ్ ఇంగ్లిష్ కోర్సుల్లో చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
* అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. చైనా తొలిస్థానంలో ఉంది.
* 2020-21 సంవత్సరంలో అత్యధికంగా 68,869 మంది గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరారు.
* అండర్ గ్రాడ్యుయేషన్‌లో 23,734 మంది.., డిగ్రీయేతరులు 1,378 మంది చేరారు.
* 2020-21లో 73,601 మంది ఓటీపీ పథకం కింద ఉద్యోగాలు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!
-
India News
Ashwini Vaishnaw: రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
World News
అడవిలో.. పాపం పసివాళ్లు ఏమయ్యారో!
-
India News
Deemed University Status: డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు
-
Ts-top-news News
Delhi Liquor Policy Case: ఈడీ అధికారులు బెదిరించడం వల్లే కవిత పేరు చెప్పారు
-
General News
Odisha Train Accident : అక్కడి వాతావరణం భీతావహం.. ‘ఈనాడు’తో ఏపీ ప్రయాణికులు