సింగపూర్‌లో ఘనంగా ‘స్వరకల్పన సమారాధన’ వార్షికోత్సవం

ఎందరో గురువులు, కళాకారులు, సంగీత ఔత్సాహికులను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న వేదిక ‘స్వరకల్పన సమారాధన’. తెలుగుపాట వైవిధ్యాన్ని నిలబెడుతూ......

Published : 20 Dec 2021 21:16 IST

సింగపూర్: ఎందరో గురువులు, కళాకారులు, సంగీత ఔత్సాహికులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న వేదిక ‘స్వరకల్పన సమారాధన’. తెలుగుపాట వైవిధ్యాన్ని నిలబెడుతూ కొత్త పాటలను వెలుగులోకి తీసుకురావటానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ క్రమంలో ‘స్వరకల్పన సమారాధన’ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. విద్య సంగీతం అకాడమీ (సింగపూర్), ద్వారం లక్ష్మి అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సర్వీసెస్ (తిరుపతి),  శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సహకారంతో యూట్యూబ్‌ వేదికగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను సంగీత గురువులకు అంకితం చేస్తూ వారు రచించి స్వరపరిచిన సంగీతాన్ని ప్రసారం చేశామని నిర్వాహకులు తెలిపారు. అన్నమయ్య కీర్తనలు, వర్ణనలు, థిల్లానాలు, శాస్త్రీయ కృతులతో అంతర్జాలంలో తెలుగు వారందరినీ రెండున్నర గంటలపాటు ఈ కార్యక్రమం అలరించింది.

ఈ వేడుకలలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన గురువులు లహరి కొలచెల, డాక్టర్ ద్వారం లక్ష్మి, డాక్టర్ శేషులత విశ్వనాథ్, తాడేపల్లి సుబ్బలక్ష్మి, మోదుమూడి సుధాకర్, ద్వారం V K G త్యాగరాజ్, డాక్టర్ యనమండ్ర శ్రీనివాసశర్మ, లక్ష్మీ సూర్య తేజ, విష్ణుభట్ల రామచంద్రమూర్తి, కమలాదీప్తి పాడిన కీర్తనలను ప్రత్యక్షప్రసారం చేశారు. గురువులపేరు మీద వారు ఎంపిక చేసిన 11మంది కళాకారులకు పారితోషకం రూపంలో ఆర్థికసహాయాన్ని కూడా అందచేశామని నిర్వాహకులు కార్యక్రమంలో ప్రకటించటం ముదావహం. సింగపూర్, భారత దేశాల నుంచే కాకుండా అమెరికా, యూకే, మలేషియాల నుంచి తెలుగు వారు ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంలో వీక్షించారు. 

మన సంగీతం, సాంస్కృతిక విలువలపై ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి విద్య సంగీత అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కాపవరపు విద్యాధరి వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులందరినీ అలరించారు.  శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ విచ్చేసి చక్కటి సందేశం ఇచ్చారు. ఈ అంతర్జాల స్వరకల్పన సమారాధన చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన RK వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని)లకు నిర్వాహకుల తరపున ధన్యవాదాలు తెలిపారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని