AP News: తెలుగోడి హిట్‌

చిన్న నిర్మాతలకు థియేటర్లు దొరక్క కష్టాలు, భారీ బడ్జెట్‌ సినిమాలకు ప్రభుత్వాల నుంచి ఆంక్షలు, వీటికి పరిష్కారం చూపిస్తూ సరికొత్త ఓటీటీ అందుబాటులోకి రానుంది. హిట్‌ పేరుతో తయారైన ఈ ఓటీటీని అమెరికాలో ఉండే తెలుగోడు

Updated : 22 Dec 2021 13:26 IST

కొత్త తరహా ఓటీటీ రూపొందించిన ప్రవాసాంధ్రులు


తన ఓటీటీ గురించి వివరిస్తున్న రంజిత్‌

ఈటీవీ, అమరావతి: చిన్న నిర్మాతలకు థియేటర్లు దొరక్క కష్టాలు, భారీ బడ్జెట్‌ సినిమాలకు ప్రభుత్వాల నుంచి ఆంక్షలు, వీటికి పరిష్కారం చూపిస్తూ సరికొత్త ఓటీటీ అందుబాటులోకి రానుంది. హిట్‌ పేరుతో తయారైన ఈ ఓటీటీని అమెరికాలో ఉండే తెలుగోడు రూపొందించటం విశేషం. 4కే నాణ్యతతో దృశ్యాల్ని ప్రేక్షకులకు అందించటంతో పాటు 30 భాషల్లో సినిమాలు ఈ వేదికపై విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. కొల్లు రంజిత్‌ స్వస్థలం విజయవాడ. ఇక్కడే ఇంజినీరింగ్‌ వరకూ చదివిన రంజిత్‌ ఐఐఎంలో ఎంబీఏ, అమెరికాలో ఎం.ఎస్‌. చేశారు. ప్రస్తుతం అమెరికాలో డెల్‌ సంస్థలో సైబర్‌ సెక్యూరిటికీ సంబంధించి టీం లీడర్‌గా ఉన్నారు. తన మిత్రుడు వెంకట్‌ ఏలేటితో కలిసి కొత్త ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఓటీటీలకు డిమాండ్‌ పెరిగింది. నిర్మాతలే తమ సినిమాల్ని అప్‌లోడ్‌ చేసుకోవటంతో పాటు టికెట్‌ ధరలు వారే నిర్ణయించుకోవచ్చు. టీవీ, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ ఫోన్లో సినిమా చూడొచ్చు. మూడు ఫార్మాట్లకు సంబంధించి దీన్ని డిజైన్‌ చేశారు. టీవీ రకాన్ని బట్టి 4కే, హెచ్‌డీ, సెమీ హెచ్‌డీ, ఎస్‌డీ ఫార్మాట్లలో సినిమా వస్తుంది. కొత్త సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని,  ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి సంబంధించిన సర్వర్ల నుంచి సినిమా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశామని రంజిత్‌ చెబుతున్నారు.


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts