Health Cards: ప్రవాసుల కుటుంబ సభ్యులకు ఆప్యాయ హెల్త్‌కార్డులు

ఎన్నారైల తల్లిదండ్రులకు (తెలుగు రాష్ట్రాల్లో ఉండేవారికి) వైద్యసేవలు అందించేందుకు సన్‌షైన్‌ ఆసుపత్రితో తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఆయా

Updated : 06 Jan 2022 09:11 IST

సన్‌షైన్‌ ఆసుపత్రితో తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఒప్పందం

ఒప్పంద పత్రాలను చూపుతున్న సన్‌షైన్‌ ఆసుపత్రి ఎండీ గురవారెడ్డి, తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: ఎన్నారైల తల్లిదండ్రులకు (తెలుగు రాష్ట్రాల్లో ఉండేవారికి) వైద్యసేవలు అందించేందుకు సన్‌షైన్‌ ఆసుపత్రితో తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఆయా కుటుంబసభ్యులకు ఆప్యాయ హెల్త్‌కార్డులు అందిస్తున్నట్లు  ఆసుపత్రి ఎండీ డా.ఏ.వి.గురవారెడ్డి వెల్లడించారు. రూ.7,500 బేసిక్‌ కార్డు తీసుకున్నవారికి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వైద్య సహాయం అవసరమైనా తమ వైద్యబృందాలు వారి ఇంటికెళ్లి ఆసుపత్రిలో చేర్చడం, వైద్యం అందించడంతో పాటు సరైన సూచనలు, సలహాలు అందిస్తాయని తెలిపారు. అమెరికాలో ఉండే పిల్లలకు ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమాచారం అందించడం దీని ముఖ్యఉద్దేశమని చెప్పారు. సన్‌షైన్‌-కిమ్స్‌ ఆసుపత్రుల్లో ఈ కార్డు తీసుకున్నవారికి ప్రత్యేక రాయితీలు అందిస్తామని, అడ్వాన్స్‌డ్‌ కార్డుతో వైద్య బీమా సహా అదనపు ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు వివరించారు. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా అమెరికాలో నివసించే తెలుగు ఎన్నారై కుటుంబాలకు ఈ కార్డులు అందిస్తున్నామని, త్వరలోనే అన్ని దేశాల్లోని ఎన్నారైలకు వర్తింపజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షులు పటోళ్ల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts