తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘హెల్త్‌ గర్ల్‌- హెల్త్‌ ఫ్యూచర్‌’ కార్యక్రమం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘హెల్త్‌ గర్ల్‌-హెల్త్‌ ఫ్యూచర్’ కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని జిల్లా పరిషత్‌హైస్కూల్‌అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘హెల్త్‌ గర్ల్‌-హెల్త్‌ ఫ్యూచర్’ కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని జిల్లా

Published : 10 Mar 2022 23:40 IST

నాగాయలలంక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘హెల్త్‌ గర్ల్‌-హెల్త్‌ ఫ్యూచర్’ కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని జిల్లా పరిషత్‌హైస్కూల్‌, స్కాలర్స్‌ కాన్వెంట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు 250 మంది విద్యార్థినులు హాజరయ్యారు. ప్రముఖ గైనకాలజిస్టు తేజస్వి పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినులందరికీ ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి హిమోగ్లోబిన్‌శాతం ఎంత ఉందో పరిశీలించారు. రక్తహీనతను అధిగమించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారు. విద్యార్థునులకు విటమిన్స్‌, కాల్షియం టాబ్లెట్లు, శానిటరీ ప్యాడ్స్‌ పంపిణీ చేశారు. 9నుంచి 14 ఏళ్ల విద్యార్థునులు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 6 నెలల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాలని ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ చెరుకూరి చాముండేశ్వరి సూచించారు. అలా చేయడం వల్ల మహిళల్లో ఎక్కువగా వచ్చే సర్వైకల్‌ క్యాన్సర్‌ను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక వల్లేపల్లి స్పాన్సర్‌గా వ్యవహరించారు. ప్రోగ్రాం కో-ఆర్డినేటర్స్‌గా తానా ఫౌండేషన్‌ కార్యదర్శి శశికాంత్‌ వల్లేపల్లి, తానా నార్త్‌ సెంటర్‌ ఆర్‌వీపీ సాయి బొల్లినేని, పద్మజ బెవర వ్యవహరించారు. తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకటరమణ, తానా ప్రెసిడెంట్‌ అంజయ్య చౌదరి లావు, స్వచ్ఛ నాగాయలంక సేవా సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని