యూఏఈలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు తరంగిణి, సంప్రదాయం, ఇస్కాన్ వారి సంయుక్త ఆద్వర్యంలో

Published : 12 Apr 2022 13:21 IST

యూఏఈలోని రస్ అల్ ఖైమా నగరంలోని దిల్లీ ప్రైవేట్ స్కూల్ ప్రాంగణంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు తరంగిణి, సంప్రదాయం, ఇస్కాన్ వారి సంయుక్త ఆద్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కూచిపూడి నృత్యాలు, ఇస్కాన్ బృంద చిన్నారుల రామదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, భగవద్గీత పారాయణాల నడుమ ఈ వేడుకలు ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నులపండువగా కొనసాగాయి. శ్రీ సీతారాముల పల్లకి సేవలో భక్తులందరూ పాల్గొన్నారు. పానకం, వడపప్పు, కమ్మని విందు భోజనాలతో తెలుగు సంస్కృతీ  సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో ఆనందోత్సాహాలతో ఈ వేడుకలు జరిగాయి. యూఏఈలోని వివిధ ఏమిరేట్స్ నుంచి ఇస్కాన్ భక్త బృందాలు, భక్తులు సుమారు 3000 మందికి పైగా హాజరయ్యారు. తెలుగు తరంగిణి అద్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేశ్‌, సంప్రదాయం ధర్మరాజ మురారిదాస్ ప్రభుల ఆద్వర్యంలో సభ్యులు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు