యూఏఈలో తెలుగు అసోసియేషన్‌ రంజాన్‌ తోఫా పంపిణీ

యూఏఈలోని ప్రభుత్వ గుర్తింపు కలిగిన తెలుగు అసోసియేషన్ బృందం పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్‌ తోఫాను పంపిణీ చేసింది.

Published : 17 Apr 2022 19:52 IST

దుబాయ్‌: యూఏఈలోని ప్రభుత్వ గుర్తింపు కలిగిన తెలుగు అసోసియేషన్ బృందం పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్‌ తోఫాను పంపిణీ చేసింది. దుబాయ్‌లోని వివిధ ప్రదేశాల్లో గల లేబర్ క్యాంప్‌లకు వెళ్లి సుమారు వెయ్యి మందికి బియ్యం, పప్పు, నూనె తదితర వంట సామగ్రిని బృంద సభ్యులు అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఉగ్గిన దినేష్ మాట్లాడుతూ దాతల సాయంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని, మున్ముందు మరింత ప్రణాళికలతో ముందుకెళ్తామని అన్నారు. సహకారం అందిస్తున్న దుబాయ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీకి కృతజ్ఞతలు తెలిపారు. 23, 24 తేదీల్లో మరోసారి ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రవి ఉట్నూరు, సాయిప్రకాష్ సుంకు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాల్ని పలువురు అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని