అమెరికా వెళ్లే విద్యార్థులకు శుభవార్త.. ఆ సమయం భారీగా తగ్గిపోయింది!

అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు శుభవార్త. విద్యార్థి వీసాల స్లాట్ల సంఖ్యను ఆ దేశం భారీగా పెంచింది. వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గిపోయింది. పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే 

Updated : 19 Apr 2022 06:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు శుభవార్త. విద్యార్థి వీసాల స్లాట్ల సంఖ్యను ఆ దేశం భారీగా పెంచింది. వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గిపోయింది. పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు మాత్రం వేచి ఉండాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల వరకు వీసా స్లాట్ల కోసం సుమారు మూడేళ్ల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ‘విద్యార్థులకు పెరగనున్న వీసా స్లాట్లు’ శీర్షికను శుక్రవారం ఈనాడులో కథానాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కాన్సులేట్‌ పరిధి నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఎదురుచూపులకు ఆ దేశం తెరదించింది. సోమవారం నుంచి భారీగా విద్యార్థి వీసా స్లాట్లను విడుదల చేసింది. ఫలితంగా స్లాట్ల కోసం వేచి ఉండే సమయం 911 రోజుల నుంచి ఒక్కసారిగా 68 రోజులకు తగ్గింది. హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో పర్యాటక వీసా కోసం వేచి ఉండే సమయం సోమవారానికి కూడా 899 రోజులుగానే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని