US Visa: అమెరికా పర్యాటకులకు శుభవార్త

అమెరికా వెళ్లేవారికి శుభవార్త. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. పర్యాటక వీసా(బీ1-బీ2) కోసం తొలిసారి దరఖాస్తు చేసుకునేవారికి ఇప్పటివరకు పరిమితంగానే

Updated : 08 Jun 2022 04:42 IST

సెప్టెంబరు నుంచి వీసా ఇంటర్వ్యూలు

మే నుంచి విద్యార్థి వీసాల స్లాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వెళ్లేవారికి శుభవార్త. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. పర్యాటక వీసా(బీ1-బీ2) కోసం తొలిసారి దరఖాస్తు చేసుకునేవారికి ఇప్పటివరకు పరిమితంగానే వీసాలు జారీ అవుతున్నాయి. కరోనా సమయం నుంచి వీసాల జారీని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు అన్ని కాన్సులేట్‌ కార్యాలయాలు పరిమితం చేసిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన వీసాల పునరుద్ధరణను డ్రాప్‌ బాక్స్‌ విధానంలో అనుమతిస్తున్నారు. తొలిసారి పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ప్రస్తుతం 890 రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సెప్టెంబరు నుంచి ఇంటర్వ్యూల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ తాజాగా ప్రకటించింది. ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ స్లాట్లను దశలవారీగా పెంచేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చేనెల నుంచి విద్యార్థి(ఎఫ్‌-1) వీసా ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. జూన్‌ నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. గడిచిన ఏడాది మిషన్‌ ఇండియా ద్వారా 62 వేల మంది విద్యార్థులకు అమెరికా జారీ చేసింది. ఈ దఫా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో జారీ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని