ఫిలడెల్ఫియాలో తెదేపా నేత మళ్ల అప్పారావుకు సన్మానం

అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్‌ నేత, వైజాగ్ మాజీ కార్పొరేటర్ మళ్ల అప్పారావును మే 2న అమెరికాలోని .....

Published : 02 May 2022 22:33 IST

ఫిలడెల్ఫియా: అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్‌ నేత, వైజాగ్ మాజీ కార్పొరేటర్ మళ్ల అప్పారావును మే 2న అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఫిలడెల్ఫియా తెలుగుదేశం అభిమానులు ఘనంగా సత్కరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిస్వార్థంగా సేవలందిస్తున్న అప్పారావులాంటి నేతలు.. పార్టీకి వెన్నెముకలాంటి వారని, ఎన్టీఆర్‌ స్ఫూర్తితో చంద్రబాబు నాయకత్వంలో పార్టీకి పునర్‌ వైభవం కోసం కృషిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మళ్ల అప్పారావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ పిలుపు మేరకు అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చానని, ప్రవాసాంధ్రులంతా చంద్రబాబు నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో తెదేపా గెలుపుకోసం కృషిచేయాలని కోరారు. పట్టాలు తప్పిన ప్రగతి చక్రాలను మళ్లీ గాడిలో పెట్టి ఏపీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి రవి, సునీల్‌ కోగంటి, గోపి వాగ్వాల, సతీష్ తుమ్మల, సాంబయ్య కోటపాటి, కోటి, పవన్ నడింపల్లి, ఫణి కంతేటి, విశ్వనాధ్ కోగంటి మోహన్ మల్ల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు