తానా-బాటా వసంతోత్సవం-2022.. ముఖ్య అతిథిగా అకున్ సబర్వాల్

తానా-బాటా సంయుక్తంగా నిర్వహిస్తోన్న పాఠశాల వసంతోత్సవం-2022 ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి  తెలుగు రాష్ట్రాల్లో ఏంతో సమర్థవంతంగా సేవలందిస్తోన్న పోలీస్ ఉన్నతాధికారి డా.అకున్ సబర్వాల్' ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 22 May 2022 12:35 IST

తానా-బాటా సంయుక్తంగా నిర్వహిస్తోన్న పాఠశాల వసంతోత్సవం-2022 ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి  తెలుగు రాష్ట్రాల్లో ఏంతో సమర్థవంతంగా సేవలందిస్తోన్న పోలీస్ ఉన్నతాధికారి డా.అకున్ సబర్వాల్' ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ..  తాను ఎలా తెలుగు నేర్చుకుంది వివరించారు. అమెరికాలో కూడా మాతృభాషను మరచిపోకుండా ఏంతో  ఇష్టపడి, కష్టపడి నేర్చుకున్న వారికి డిగ్రీ సర్టిఫికెట్స్ అందజేసే అవకాశం తనకు వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నానన్నారు. ఎంతో శ్రద్ధ తీసుకొంటున్న తల్లిదండ్రులను, ఉపాధ్యాయ బృందానికి, తానా-బాటా కార్యవర్గానికి, ముఖ్యంగా విజయ ఆసూరిని అకున్ సబర్వాల్ మనస్ఫూర్తిగా అభినందించి వారి సేవలను కొనియాడారు. అనంతరం మిల్పిటాస్, శాన్ రామన్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ విద్యాధికారులు పిల్లలను అభినందించారు.
తానా కార్యదర్శి సతీష్ వేమూరి తానా కార్యక్రమాలను, బాటాతో కలిసి ఎలా పనిచేస్తోంది వివరిస్తూ.. శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమానికి వీరు ఉప్పాల, ప్రసాద్ మంగిన, రమేశ్‌ కొండా, రాం తోట, శ్రీనివాస్ వల్లూరిపల్లి, శ్రీనివాస్ వేముల, మనోహర్ బండ్ల, శ్రీధర్ చావా, సందీప్ ఇంటూరితోపాటు బేఏరియాలోని విద్యార్థుల తల్లితండ్రులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని