పిట్స్‌బర్గ్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

యుగ పురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌ నగరంలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్‌, తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆధ్వర్యంలో ......

Published : 30 May 2022 19:31 IST

పిట్స్‌బర్గ్‌: యుగ పురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌ నగరంలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్‌, తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆధ్వర్యంలో మే 28న నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రవాసాంధ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిట్స్‌బర్గ్‌లో నివాసం ఉంటున్న తెలుగింటి ఆడపడుచులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో.. ఎన్టీఆర్‌ వీరాభిమాని, వై.వి.ఎస్ చౌదరి, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాస్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, విశాఖ తెదేపా సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి ముఖ్య అతిథులుగా జూమ్‌ కాల్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్న గారి సినిమాలపై తమకున్న అభిప్రాయాలను, ఆయనతో తమ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్‌ వివిధ సంస్కరణల ద్వారా సమాజ శ్రేయస్సుకు తనదైన ముద్రను వేయడంలో ప్రదర్శించిన పట్టుదల తదితర ఆసక్తికర అంశాలను వివరించారు.

తెదేపా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, ఏలూరి సాంబశివరావు, గౌతు శిరీష కొన్ని అనివార్య కారణాల వల్ల జూమ్‌ కాన్ఫరెన్స్ కాల్‌కు  హాజరుకాలేకపోతున్నందున ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పిట్స్‌బర్గ్‌ తెదేపా అభిమానులకు తమ రికార్డెడ్‌ వీడియో సందేశాలతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్న ఎన్టీఆర్‌ గురించి కార్యవర్గం నిర్వహించిన ప్రత్యేక క్విజ్‌ పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్విజ్‌లో ప్రథమ విజేతగా రఘునాథరావు మేలిమి, ద్వితీయ విజేతగా సునీల్ కాంతేటి, తృతీయ విజేతగా శ్రీహర్ష కలగర నిలిచి బహుమతులు గెలుచుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి తమ సహకారాన్ని అందించిన రవీంద్ర చలసాని, సాయి రంగారావు అక్కినేని, రంగారావు తూమాటి, మోహన్ కమ్మ, శ్రీహర్ష కలగర, సునీల్ కాంతేటి, అట్లూరి, మేలిమి హరిణ (వ్యాఖ్యాత), చైతన్య మేలిమి, రమేష్ వేముల (ఫోటోగ్రాఫర్)కు,  అలాగే  పసందైన విందును సమకూర్చిన చట్నీస్ (Chutneys), రెడ్ చిల్లీస్ (Red Chillies), తమరిండ్ (Tamarind), మింట్ (Mintt) రెస్టారెంట్ల యాజమాన్యాలకు, ఇతర సభ్యులకు కార్యక్రమ నిర్వాహకులు సునీల్ పరుచూరి, వెంకట్ నర్రా, రవి కిరణ్ తుమ్మల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని