TANA: ‘తానా’ వితరణ బుగ్గిపాలు.. మంటల్లో కొవిడ్‌ సామగ్రి

కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలకు పంపిణీ చేసేందుకు వీలుగా తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) సేకరించి పంపించిన సుమారు రూ. 11 కోట్ల విలువైన రక్షణ

Updated : 03 Jun 2022 10:26 IST

విశాఖపట్నం (గాజువాక), న్యూస్‌టుడే: కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలకు పంపిణీ చేసేందుకు వీలుగా తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) సేకరించి పంపించిన సుమారు రూ. 11 కోట్ల విలువైన రక్షణ సామగ్రి మంటల్లో కాలిపోయింది. విశాఖపట్నం పెదగంట్యాడలో శ్రావణి షిప్పింగ్‌ గోదాములో బుధవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో శానిటైజర్లు, గ్లౌజులు, మాస్క్‌లు, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. గతేడాది డిసెంబరులో కెనడా నుంచి రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా సామగ్రి దిగుమతి చేసుకున్నట్లు సొసైటీ రాష్ట్ర ఛైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలకు గవర్నర్‌ చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సరకు తీసుకురావడానికి, ఇక్కడ గోదాములో భద్రపరచడానికి అవసరమైన అనుమతుల్లో జాప్యం వల్ల పంపిణీ ఆలస్యమైందన్నారు. ఈ విషయాన్ని తానా సభ్యుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని