తానా ఆధ్వర్యంలో ‘తెలుగు తేజం’

విదేశాల్లో నివసించే తెలుగు కుటుంబాల పిల్లలు, యువకుల్లో మాతృభాషపై మక్కువ పెంచేందుకు ‘తెలుగు తేజం’ పోటీలు నిర్వహించారు. ‘తానా- తెలుగు పరివ్యాప్తి’ కమిటీ ఆధ్వర్యంలో కిశోర, కౌమార, కౌశల విభాగాల్లో రెండు రోజుల

Updated : 07 Jun 2022 10:02 IST

మాతృభాషపై మక్కువ పెంచే లక్ష్యంతో పోటీలు
ప్రవాసుల నుంచి విశేష స్పందన

ఈనాడు, అమరావతి: విదేశాల్లో నివసించే తెలుగు కుటుంబాల పిల్లలు, యువకుల్లో మాతృభాషపై మక్కువ పెంచేందుకు ‘తెలుగు తేజం’ పోటీలు నిర్వహించారు. ‘తానా- తెలుగు పరివ్యాప్తి’ కమిటీ ఆధ్వర్యంలో కిశోర, కౌమార, కౌశల విభాగాల్లో రెండు రోజుల పాటు జూమ్‌ ద్వారా నిర్వహించిన ఈ పోటీలకు వివిధ దేశాల నుంచి విశేష స్పందన లభించింది. మెదడుకు మేత, పద విన్యాసం, పురాణాలు, పదచదరంగం, తెలుగు జాతీయాలు, వేమన పద్యాలు, సుమతీ శతకం, మన తెలుగు కవులు, తెలుగులో మాట్లాడటం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు నగదు పారితోషికాలతోపాటు, బహుమతులు, ప్రశంసపత్రాలు అందించారు. పోటీలకు రూపకల్పన చేసిన డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర, చినసత్యం వీర్నపు, పుస్తక రచన చేసిన చొక్కాపు వెంకటరమణను తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి అభినందించారు.

కిశోర (5-10 సంవత్సరాలు) విభాగం

మొదటి బహుమతి: శ్రీనిధి యలవర్తి, ప్లేనో, టెక్సాస్‌
రెండో బహుమతి: చాణక్య సాయిలంక, మిల్టిపాస్‌, కాలిఫోర్నియా
మూడో బహుమతి: వేదాన్షి చంద, మెలిస్సా, టెక్సాస్‌
ప్రోత్సాహక బహుమతులు: శ్రీనిజ యలవర్తి, ఉదయ్‌ వొమరవల్లి, టెక్సాస్‌


కౌమార (11-14 సంవత్సరాలు) విభాగం
మొదటి బహుమతి: రాధ శ్రీనిధి ఓరుగంటి, సింగపూర్‌
రెండో బహుమతి: ఇషిత మూలే, డేటన్‌, న్యూజెర్సీ
మూడో బహుమతి: సంజన వినీత దుగ్గి, అబు హలీఫా, కువైట్‌
ప్రోత్సాహక బహుమతులు: ద్విజేష్‌ గోరంట్ల (ఆస్టిన్‌, టెక్సాస్‌), ఉదయ్‌ వొమరవెల్లి (ఇర్వింగ్‌, టెక్సాస్‌)


కౌశల (15-18 సంవత్సరాలు)
మొదటి బహుమతి: ఆదిత్య కార్తీక్‌ ఉపాధ్యాయుల, అట్లాంటా, జార్జియా
రెండో బహుమతి: షణ్ముఖ విహార్‌ దుగ్గి, అబుహలీఫా, కువైట్‌,
మూడో బహుమతి: యష్మిత్‌ మోటుపల్లి, ప్లేనో, టెక్సాస్‌,
ప్రోత్సాహక బహుమతులు: గణేష్‌ నలజుల, ఆబ్రీ, టెక్సాస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని