US Visa: భారతీయ విద్యార్థులకు అమెరికా శుభవార్త

అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు శుభవార్త. గతేడాదిని మించి ఈ ఏడాది భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలను జారీ చేయనున్నట్లు ఇక్కడి అమెరికా ఎంబసీ అధికారిణి

Updated : 10 Aug 2022 11:10 IST

ఈ ఏడాదీ రికార్డు స్థాయిలో వీసాల జారీకి సన్నద్ధం

దిల్లీ: అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు శుభవార్త. గతేడాదిని మించి ఈ ఏడాది భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలను జారీ చేయనున్నట్లు ఇక్కడి అమెరికా ఎంబసీ అధికారిణి పాట్రిసియా లసినా తెలిపారు. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ 2021 వేసవిలో రికార్డు స్థాయిలో సుమారు 62 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేశామని, ప్రస్తుత ప్రవేశాల కోసం లక్ష దరఖాస్తులను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎంబసీలో మంగళవారం నిర్వహించిన 6వ విద్యార్థి వీసాల దినోత్సవంలో ఆమె ఈమేరకు మాట్లాడారు. ‘‘అమెరికా విద్యాసంస్థలకు, సమాజానికి తోడ్పాటునందిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు మా దేశం ఎంతో విలువనిస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతీయలు రెండో స్థానంలో ఉన్నారు’’ అని పాట్రిసియా పేర్కొన్నారు. ప్రస్తుతం 2 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారని, మొత్తం విదేశీ విద్యార్థుల్లో వారి సంఖ్య 20 శాతానికిపైగా ఉందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని