భారత్‌కు వన్నె తెస్తున్న తెలంగాణ

ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే దేశానికి తెలంగాణ తలమానికంగా మారిందని, ప్రబల ఆర్థికశక్తిగా ఊతమిస్తోందని, దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయత్వంలో ఘనమైన పాలనను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచిందని

Updated : 14 Jun 2022 06:17 IST

సీఎం కేసీఆర్‌దే ఈ ఘనత
లండన్‌లో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని

ఈనాడు, హైదరాబాద్‌: ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే దేశానికి తెలంగాణ తలమానికంగా మారిందని, ప్రబల ఆర్థికశక్తిగా ఊతమిస్తోందని, దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయత్వంలో ఘనమైన పాలనను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పారిశ్రామికంగా ప్రపంచ దేశాలలో ఖ్యాతి పొందుతోందన్నారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏడాదిన్నరలోగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కుటుంబ సభ్యులతో కలసి లండన్‌ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం బ్రిటన్‌ తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ కేసీఆర్‌ ఉద్యమదీక్ష, పట్టుదల, పోరాటం వల్ల తెలంగాణ సిద్ధించింది. రాష్ట్రాన్ని సీఎం అద్భుతంగా అభివృద్ధి చేశారు. కేసీఆర్‌ పథకాలు, కార్యక్రమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకొస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా తెలంగాణ అంటే ప్రత్యేకంగా గౌరవిస్తున్నారు. బోనాలు, బతుకమ్మ పండగలను నేడు అనేక దేశాలలో నిర్వహించడం మనకెంతో గర్వకారణం. ప్రవాసులు తెలంగాణకు రాయబారులుగా వ్యవహరిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారు’’ అని తలసాని అన్నారు. ఈ సందర్భంగా బోనాల పండగకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని