గోదావరి వరద బాధితులను ఆదుకోవాలి

గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని అమెరికాలోని ప్రవాసాంధ్రులకు తెదేపా ఎన్నారై విభాగం అమెరికా కోఆర్డినేటర్‌ జయరాం కోమటి పిలుపునిచ్చారు. వరద బాధితులను ఆదుకోవడంలో

Updated : 02 Aug 2022 06:34 IST

తెదేపా ఎన్నారై విభాగం యూఎస్‌ కోఆర్డినేటర్‌ జయరాం కోమటి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని అమెరికాలోని ప్రవాసాంధ్రులకు తెదేపా ఎన్నారై విభాగం అమెరికా కోఆర్డినేటర్‌ జయరాం కోమటి పిలుపునిచ్చారు. వరద బాధితులను ఆదుకోవడంలో జగన్‌ సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన అధ్యక్షతన అమెరికాలోని బే ఏరియాలో మూడో మహానాడును ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ....తెదేపా అధినేత చంద్రబాబు వయసును కూడా లెక్క చేయకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా సహాయ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. సీఎం జగన్‌ అసమర్థత, ఆర్థిక, రాజకీయ, విధానాల వల్ల ఏపీలో పాలన అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకుడు మన్నవ సుబ్బారావు, ఎన్నారైలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని