అమెరికా రాజకీయాల్లోనూ తెలుగువారు రాణించే రోజులు రానున్నాయ్‌..!

ఎన్టీఆర్‌, చంద్రబాబు స్ఫూర్తిగా అమెరికా రాజకీయాల్లోనూ తెలుగువారు రాణించే రోజులు రానున్నాయని తెదేపా నేత,.....

Published : 17 Aug 2022 21:44 IST

ఫిలడెల్ఫియాలో దేవినేని ఉమాకు ఘన సత్కారం

ఫిలడెల్ఫియా: ఎన్టీఆర్‌, చంద్రబాబు స్ఫూర్తిగా అమెరికా రాజకీయాల్లోనూ తెలుగువారు రాణించే రోజులు రానున్నాయని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయనను ఈ నెల 16న తెదేపా అభిమానులు ఘనంగా సత్కరించారు. తెదేపా ఆవిర్భావం నుంచి నిస్వార్ధంగా సేవలందిస్తున్న దేవినేని ఉమా లాంటి సీనియర్ నాయకులు పార్టీకి వెన్నెముక లాంటివాని పలువురు ఎన్నారైలు ప్రశంసించారు. ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీకి పూర్వవైభవం కోసం కృషిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం దేవినేని మాట్లాడుతూ.. ప్రవాసాంధ్రులంతా తెదేపా అధినేత చంద్రబాబు నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టాలుతప్పిన ప్రగతి చక్రాలను మళ్లీ గాడిలో పెట్టి ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావలాన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొంది తెలుగుజాతి ఆత్మౌగరవమే నినాదంగా తెదేపాను స్థాపించి దేశ రాజకీయాలకు ఎన్టీఆర్‌ దిశానిర్దేశం చేశారని కొనియాడారు. నందమూరి అభిమానులుగా ఎన్టీఆర్‌ ఆశయసాధనకు నిరంతరం కృషిచేయాల్సిన బాధ్యతను గుర్తుచేశారు.

ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. దేవినేని ఉమా లాంటి నాయకులు అరుదైనవారని, నీటిపారుదల శాఖ మంత్రిగా ఏపీ ప్రగతికి విశేష కృషిచేసి తనదైన ముద్ర వేశారని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి రవి, హరీష్ కోయా, శ్రీధర్ అప్పసాని, సునీల్ కోగంటి, హరి బుంగతావుల, హరి మోటుపల్లి, వంశీ వాసిరెడ్డి, సుధాకర్ తురగా, సతీష్ తుమ్మల, గోపీ వాగ్వాల, సాంబయ్య కోటపాటి, ఫణి కంతేటి, మోహన్ మల్ల ప్రసాద్ కొత్తపల్లి, రంజిత్ మామిడి, సురేష్ యలమంచి, సాంబయ్య కోటపాటి, రవి చిక్కాల తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని