Published : 18 Aug 2022 12:31 IST

US: మిచిగన్‌ సాగినాలో ఘనంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని మిచిగన్‌ స్టేట్‌ సాగినా నగరంలో సాయిబాబా విగ్రహ వాయు ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. మూడురోజుల పాటు చేపట్టిన ఈ కార్యక్రమంలో అఖండ దీపారాధన, అంకురార్పణ, పంచగవ్య ప్రాషణ, వాస్తు మంటపారాధన, సాయిబాబా, దత్తాత్రేయ, నవగ్రహ హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను బ్రహ్మశ్రీ భాగవతుల యుగంధర శర్మ (కూచిపూడి) ఆధ్వర్యంలో ముగ్గురు అర్చకులు జరిపారు. విగ్రహ ప్రతిష్ఠలో భాగంగా యుగంధర శర్మ అలంకరించిన సర్వతో భద్రమండల సకల దేవతారాధన విశేషంగా ఆకట్టుకుంది. మూడురోజులపాటు సాయి నామ కీర్తనలు, మంత్రోచ్ఛారణతో సాయి సమాజ్‌ ఆఫ్‌ సాగినా ప్రతిధ్వనించింది.

జనవరిలో కేవలం నలుగురు స్నేహితులు కలిసి ప్రారంభించిన సాయి బాబా ధ్యాన మందిరం 8 నెలల్లో దేవాలయంగా రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా ఉందని సాయి సమాజ్‌ ఆఫ్‌ సాగినా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ మురళీ గింజుపల్లి చెప్పారు. ఆలయ నిర్వహణకు సహకరించిన శ్రీనివాస్‌ వేమూరి, హరిచరణ్‌ మట్టుపల్లి, శ్రీధర్‌ గింజుపల్లి, సాంబశివరావు కొర్రపాటి, లీలా పాలడుగు, లక్ష్మీ మట్టుపల్లి, కృష్ణ జన్మంచిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. సాయిబాబా విగ్రహాన్ని సొంత ఖర్చులతో రాజస్థాన్‌ నుంచి తెప్పించిన వేమూరి నీలిమ- శ్రీనివాస్‌ దంపతులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ గింజుపల్లి మాట్లాడుతూ ప్రతి గురువారం ప్రవాస భారతీయులంతా భక్తి శ్రద్ధలతో సాయిబాబాకు హారతులు, భజనలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఇంత వైభవంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో 15వేల చదరపు అడుగుల స్థలంలో ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద సాయిబాబా ఆలయం నిర్మించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. మూడురోజుల ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజూ మధ్యాహ్నం, సాయంత్రం మూడు వందల మందికి అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని నీలిమ శ్రీనివాస్‌ వేమూరి, సెల్వి విష్ణుకుమార్‌, తనూజ శ్రీనివాస్‌ వడ్డమాని, మోనికా మహేశ్‌భుతి, పల్లవి అమిత్‌ షహసానె, రోహిణి జితేంద్ర వైద్య, శుభ రఘు మెల్గిరి, కల్పన మురళీ తమ్మినాన, సుజని మురళీ గింజుపల్లి, హేమమాలిని మహేశ్‌ సమతం, నికిత రాహుల్‌ గుప్తా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో మిచిగన్‌లో స్థిరపడిన భారత సంతతి వైద్యులు డాక్టర్‌ కేపీ కరుణాకరన్‌-లక్ష్మి, రఘురాం సర్వేపల్లి, నరేంద్రకుమార్‌, కిశోర్‌బాబు- సామ్రాజ్యం కొండపనేని, సుబ్బారావు-వాణిశ్రీ చావలి, సుబ్రహ్మణ్యం-సుందరయాదం, అనిరుధ్‌-విద్య భండివార్‌, విజయారావులతో పాటు డెట్రాయిట్‌, ఫ్లింట్, గ్రాండ్‌ రాపిడ్స్‌, మిడ్‌ ల్యాండ్‌, బేసిటీ, సాగినా, కెనడా నుంచి సుమారు 500 మంది ప్రవాస భారతీయులతో పాటు ప్రముఖ గాయకుడు మనో హాజరయ్యారు. సుమారు 800 మంది భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని