న్యూయార్క్‌లో ఘనంగా స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు

భారతదేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), భారత సంఘాల సమాఖ్య

Updated : 24 Aug 2022 05:45 IST

ఈనాడు, అమరావతి: భారతదేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), భారత సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సినీనటుడు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాత నవీన్‌ యెర్నేని, దర్శకుడు హరీశ్‌శంకర్‌ హాజరయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతోపాటు జాతీయ జెండాలు, మువ్వెన్నల బెలూన్లతో తానా పరేడ్‌ ఫ్లోట్‌ని అందంగా అలంకరించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులు ప్రదర్శించిన లంబాడీ నృత్యాలు, దేశభక్తి గీతాలు, కూచిపూడి నృత్యాలు, స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ మాతృదేశానికి సేవ చేయడానికి తమ సంఘం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి, తానా సేవల సమన్వయకర్త రాజా కసుకుర్తి, కోశాధికారి లక్ష్మి దేవినేని, జానీ నిమ్మలపూడి, శ్రీనివాస్‌ ఓరుగంటి, విద్య గారపాటి, సుధీర్‌.ఎన్‌, శివాని, అట్లూరి శ్రీలక్ష్మి, ధృవ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని