విద్యార్థి వీసాకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు
తమ దేశంలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు అమెరికా శుభవార్త చెప్పింది. విద్యార్థి వీసా(ఎఫ్-1) దరఖాస్తు ఒకసారి తిరస్కరణకు గురైనా అదే విద్యా సంవత్సరంలో మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఒకసారి తిరస్కరణకు గురైనవారికి అమెరికా వెసులుబాటు
ఇంటర్వ్యూలకు మొదలైన స్లాట్ల కేటాయింపు
ఈనాడు - హైదరాబాద్
తమ దేశంలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు అమెరికా శుభవార్త చెప్పింది. విద్యార్థి వీసా(ఎఫ్-1) దరఖాస్తు ఒకసారి తిరస్కరణకు గురైనా అదే విద్యా సంవత్సరంలో మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.అమెరికాలో విద్యా సంవత్సరం ఇటీవల ప్రారంభం అయింది. వీసాలకు ఒత్తిడి తగ్గటంతో తిరస్కారానికి గురైన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గడిచిన రెండు మూడేళ్లలో పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు వీసాలు మంజూరు చేశారు. కొవిడ్ విజృంభణతో అమెరికా విద్యా సంస్థల్లో సైతం చేరే దేశీ విద్యార్థుల సంఖ్యా తగ్గింది. పరిస్థితులు సద్దుమణగడంతో యూఎస్ వెళ్లేందుకు ఆసక్తి చూపే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో తొలిసారి విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఒకదఫా విద్యార్థి వీసా తిరస్కారానికి గురైన పక్షంలో ఆ ఏడాదిలో మళ్లీ దరఖాస్తు చేసుకునే విషయంలో పరిమితులు విధించింది. అర్హులైన వారి అవకాశాలకు ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. తాజాగా దానిని సడలించింది. కరోనా ముందు వరకు దేశవ్యాప్తంగా ఏటా 50 నుంచి 60 వేల వరకు ఎఫ్-1 వీసాలను భారతీయ విద్యార్థులకు జారీ చేసేవారు. ఒకదశలో ఆ సంఖ్య 62 వేలు సైతం దాటినట్లు అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి ఒకరు ఇటీవల స్పష్టం చేశారు.
అత్యవసర అపాయింట్మెంట్
తిరస్కారానికి గురైన విద్యార్థులు మరోదఫా వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ఈ నెలలో యూఎస్ కొన్ని స్లాట్లు విడుదల చేసింది. ఇప్పటికీ స్లాట్లు లభించని విద్యార్థులు అత్యవసర అపాయింట్మెంట్ వెసులుబాటునూ ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది.
ఇంటర్వ్యూ అధికారి మారతారు
తిరస్కరణకు గురైన విద్యార్థి వీసా(ఎఫ్-1) దరఖాస్తుదారులు ఎవరైనా మరోదఫా ఇంటర్వ్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్లీ దరఖాస్తు చేసుకున్నప్పుడు మునుపటి అధికారి కాకుండా మరొకరు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ నెలలో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా సుమారు 15 వేల వరకు విద్యార్థి వీసా స్లాట్లు విడుదల చేశాం.
- డేవిడ్ మోయర్, పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్, యూఎస్ కాన్సులేట్ హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!