Paasport: విదేశాలకు వెళ్లే వారికి ‘శుభవార్త’
విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త. ఇకపై శనివారాల్లోనూ పాస్‌పోర్టు కేంద్రాలు సేవలు అందించనున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య
శనివారమూ పనిచేయనున్న పాస్‌పోర్టు సేవాకేంద్రాలు
ఈనాడు, హైదరాబాద్: విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త. ఇకపై శనివారాల్లోనూ పాస్‌పోర్టు కేంద్రాలు సేవలు అందించనున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రస్తుతం వారంలో ఐదు రోజులు మాత్రమే పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న వందల మంది సమస్యను ఎదుర్కొంటున్నారు. వారి దరఖాస్తులను పరిష్కరించేందుకు మూడు వారాల సమయం పడుతోంది. ఈ సమస్యను ఇటీవల ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించిన వీసా, పాస్‌పోర్టు విదేశీ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎ.సయీద్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించారు. విదేశాలకు వెళ్లే వారి సౌకర్యార్థం శనివారం కూడా పాస్‌పోర్టు సేవా కేంద్రాలు కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు’’ అని బాలయ్య వివరించారు. సెప్టెంబరు 3 నుంచి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని టోలీచౌకీ, బేగంపేట, అమీర్‌పేటతోపాటు నిజామాబాద్, కరీంనగర్‌లోని పాస్‌పోర్టు కేంద్రాలు కూడా ప్రతి శనివారం పనిచేస్తాయని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Afghanistan: భారత్లో మా ఎంబసీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నాం: ఆఫ్గానిస్థాన్
-
RC 16: రామ్చరణ్కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్ కుమార్తె ఫిక్సా..?
-
Locker: బ్యాంక్ లాకర్లలో క్యాష్ పెట్టొచ్చా? బ్యాంక్ నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్లో అనన్య
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు