తెలుగు యువకుడికి శతాబ్ది పురస్కారం ప్రకటించిన అమెరికన్ యూనివర్సిటీ
తెలుగు యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్జిటౌన్ యూనివర్సిటీ(వాషింగ్టన్ డీసీ)లోని ఫారిన్ సర్వీస్ స్కూలు
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్జిటౌన్ యూనివర్సిటీ(వాషింగ్టన్ డీసీ)లోని ఫారిన్ సర్వీస్ స్కూలు శతాబ్ది పురస్కారానికి హైదరాబాద్ యువకుడు రాజా కార్తికేయ గుండును ఎంపిక చేసింది. తమ వద్ద చదువుకున్న విద్యార్థుల నుంచి ఐదుగురిని ఈ పురస్కారానికి ఎంపిక చేయగా.. వాళ్లలో రాజా కార్తికేయ ఒకరు. ప్రస్తుతం ఆయన ఐక్యరాజ్యసమితిలో దౌత్య వేత్తగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్, నిజాం కళాశాల పూర్వ విద్యార్థి అయిన రాజా కార్తికేయ.. ఐఐఎఫ్‌టీ (న్యూదిల్లీ) నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఆ తర్వాత 2007-09లో జార్జిటౌన్ యూనివర్సిటీలోని వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ నుంచి ఎంఎస్‌ఎఫ్‌ఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫారిన్ సర్వీస్) చేశారు. గత వందేళ్ల విద్యార్థుల నుంచి వంద మందికి పైగా పేర్లు ఈ అవార్డు పరిశీలనకు వచ్చాయి. వారిలో ఎంఎస్‌ఎఫ్‌ఎస్ కోర్సు పూర్తిచేసి నాయకత్వం, సృజనాత్మకత, విలువలు, సమాజ సేవ, మానవ సంబంధాలను ప్రామాణికంగా అభ్యర్థులను సెలెక్ట్ చేసినట్లు ఎంపిక కమిటీ తెలిపింది.
ఎంపిక కమిటీలో పూర్వవిద్యార్థుల సంఘం ప్రతినిధులు, యూనివర్సిటీ అధ్యాపక ప్రతినిధులు ఉన్నారు. వారు అన్ని నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి ఐదుగురిని ఎంపిక చేసినట్లు ‘ఎంఎస్‌ఎఫ్‌ఎస్-100 ఇయర్స్’ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఐదుగురికి శతాబ్ది పురస్కారాన్ని ఎంపిక చేస్తామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/09/2023)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్