మిషిగన్‌లో ఉత్సాహంగా సాగిన ‘తానా లేడీస్ నైట్’

అమెరికాలోని మిషిగన్‌లో శుక్రవారం రాత్రి ‘తానా లేడీస్‌ నైట్‌’ ఉత్సాహంగా సాగింది. దాదాపు 500 మందికి పైగా మహిళలు పాల్గొని 80వేల డాలర్లు విరాళాలు అందించారు.

Published : 22 Oct 2022 23:21 IST

మిషిగన్‌: అమెరికాలోని మిషిగన్‌లో శుక్రవారం రాత్రి ‘తానా లేడీస్‌ నైట్‌’ ఉత్సాహంగా సాగింది. దాదాపు 500 మందికి పైగా మహిళలు పాల్గొని 80వేల డాలర్లు విరాళాలు అందించారు. ఆటపాటలు, విందు, వినోదాలతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమం మహిళల్లో నూతనోత్తేజాన్ని నింపింది. తానా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌ శృంగవరపు, తానా పౌండేషన్‌ ట్రస్టీ సురేష్‌ పుట్టగుంట, మను గొంది సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా నిరంజన్‌ శృంగవరపు మాట్లాడుతూ...‘‘ ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అంటారు. మహిళలను గౌరవించడం అందరి కర్తవ్యం. మహిళా శక్తి అసాధారణమైనది. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. వారిలో చైతన్యం, వినోదం, వికాసం కలిగించేందుకు తానా ఫౌండేషన్‌ ‘లేడీస్‌ నైట్‌’ కార్యక్రమం ఏర్పాటు చేసింది. తానా చేస్తున్న చారిటీ కార్యక్రమాలలో మహిళలు పాల్గొని సహాయం అందించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. తానా మొదటి నుంచి మహిళా సేవలకు పెద్దపీట వేస్తున్నట్టు తానా బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ హనుమయ్య బండ్ల తెలిపారు. మహిళా సాధికారత దిశగా తానా తనవంతు కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన 80వేల డాలర్ల విరాళాలు తానా అన్నపూర్ణ ప్రాజెక్టు (ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్య ఉచిత అన్నదాన కార్యక్రమం) ఏడాది పాటు కొనసాగించేందుకు ఉపయోగించనున్నట్టు సురేష్‌ పుట్టగుంట తెలిపారు. 

తానా ఉమెన్‌ కో-ఆర్డినేటర్‌ ఉమా కటికి మాట్లాడుతూ... మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుండటం అభినందనీయమన్నారు. ఆహ్వానం మన్నించి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం సంతోషంగా ఉందని మను గొంది అన్నారు.  కార్యక్రమం విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తానా కల్చరల్‌ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి భారత్‌ నుంచి ప్రత్యేక అతిథులుగా యాంకర్‌ ఉదయభాను, సినీ గాయని మంగ్లీ హాజరై అలరించారు. తానా అధ్యక్షులు అంజయ్యచౌదరి లావు ప్రోత్సాహంతో జరిగింది. తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వెంకటరమణ యార్లగడ్డ, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ గోగినేని, తానా బోర్డ్‌ ఆప్‌ డైరెక్టర్‌ లక్ష్మీ దేవినేని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రాణి అల్లూరి వందన సమర్పణ చేశారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని