తానా, ఆటా ఆధ్వర్యంలో కార్యక్రమం.. ఆద్యంతం రంజింపజేసిన ‘మేడసాని’ చమత్కారం

అమెరికాలో తానా, ఆటా, షికాగో సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో చమత్కారం, హాస్య ఉపన్యాస కార్యక్రమం వేడుకగా జరిగింది.

Published : 01 Nov 2022 09:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో తానా, ఆటా, షికాగో సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో చమత్కారం, హాస్య ఉపన్యాస కార్యక్రమం వేడుకగా జరిగింది. పంచ సహస్రావధాని, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ డా. మేడసాని మోహన్‌ సాహిత్యంలో షికాగోలో నిర్వహించిన ఈ కార్యక్రమం మూడు గంటల పాటు సాగింది. షికాగోలోని సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మేడసారి మోహన్‌ చలోక్తులు ఆద్యంతం శ్రోతలను రంజింపజేశాయి.

ఈ సందర్భంగా మేడసాని మోహన్‌ మాట్లాడుతూ మహాభారతంలోని అనేక ఘటనలు ప్రస్తుత సమాజానికి ఎలా వర్తిస్తాయనే అంశాలను వివరించారు. కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు తదితరుల పాత్రలతో అనేక అంశాలు మన బోధపడతాయన్నారు. ఆధ్యాత్మికత అంటే మతం కాదని.. అదో గొప్ప నాగరికత అని చెప్పారు. భారత సంస్కృతి, నాగరికత అతి ప్రాచీనమైనవన్నారు.

అనంతరం మేడసాని మోహన్‌ను పట్టువస్త్రాలతో ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్‌ శ్రీనివాస్‌ అరసాడ సత్కరించారు. తెలుగు సంఘాలు తానా, నాట్స్‌, ఆటా, నాటా, షికాగో ఆంధ్ర అసోసియేషన్‌, బాలాజీ హిందూ టెంపుల్‌, సాయి టెంపుల్‌ ప్రతినిధులు మేడసాని మోహన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని జయదేవ్‌ మెట్టుపల్లి, హేమ కానూరు దగ్గరుండి పర్యవేక్షిస్తూ విజయవంతంగా ముగించారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts