NRI: అమరావతి రైతులకు మద్దతుగా అమెరికా సెనేట్ ఎదుట ప్రదర్శన
అమరావతి రాజధాని ఉద్యమానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ పార్లమెంట్ భవనం ఎదుట నిల్చొని ప్రవాసాంధ్రులు సంఘీభావం తెలిపారు. కొవ్వొత్తులు వెలిగించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
వాషింగ్టన్ డీసీ: అమరావతి రాజధాని ఉద్యమానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ పార్లమెంట్ భవనం ఎదుట నిల్చొని ప్రవాసాంధ్రులు సంఘీభావం తెలిపారు. కొవ్వొత్తులు వెలిగించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిసి కూడా 3 రాజధానులంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. రైతులు ఉదారంగా భూములు ఇవ్వడమే ప్రభుత్వానికి నేరంలా కనిపిస్తోందన్నారు. 2019 డిసెంబరు 17న జగన్రెడ్డి 3 రాజధానులు ప్రకటించి అమరావతి రాజధానికి మరణశాసనం రాశారని విమర్శించారు. రాజధాని కేసు సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్న సమయంలో ప్రభుత్వం గర్జనలు, ర్యాలీలు, ఆత్మగౌరవ సభలు ఎందుకు పెడుతోందని ప్రశ్నించారు.
అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పి, గెలిచిన తర్వాత 3 రాజధానులు కడతానని, నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో కలిపితే రాజధానే అవసరం లేదని జగన్రెడ్డి భావిస్తున్నట్టు ఉందని తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే రాజధాని అంశాన్ని ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదంగా మార్చారని ఆరోపించారు. 3 రాజధానుల నిర్ణయం ఒక రాజకీయ వికృత క్రీడ అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని బలిపీఠం మీద పెట్టారని మండిపడ్డారు.
విశాఖలో తన అవినీతి సామ్రాజ్య విస్తరణ కోసం అమరావతిని సమాధి చేశారని భాను మాగులూరి విమర్శించారు. ఇప్పుడు రాజధాని రైతులు చేస్తోన్న పోరాటం ఒక్క అమరావతిలో రాజధాని కొనసాగించాలని మాత్రమే కాదు.. జగన్రెడ్డి చేస్తున్న అరాచకాలపైన జరుగుతున్న పోరాటమన్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగాలని ప్రవాసాంధ్రులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిశోర్ కంచర్ల, రమేష్ అవిర్నేని, సిద్ధార్థ బోయపాటి, హనుమంతరావు వెంపరాల, రమేష్ బాబు గుత్తా, కిరణ్ మావిళ్లపల్లి, శివప్రసాద్ వంగల్లు, కాశీం వెలుతుర్ల, సీతారాం, రామినేని వినీల్, రామకృష్ణ ఇంటూరి, శ్రీనాథ్ రావుల, వెంకటేశ్వరరావు ఎమ్, వీర నారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా