మానవ సంబంధాలపై ‘వీధి అరుగు’ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ సదస్సు

ఏటా వందలాది మంది భారతీయులు వలస వెళ్తున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, మెరుగైన జీవనశైలి.. ఇలా ఎన్నో కారణాలతో విదేశాల్లో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

Published : 20 Dec 2022 12:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏటా వందలాది మంది భారతీయులు వలస వెళ్తున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, మెరుగైన జీవనశైలి.. ఇలా ఎన్నో కారణాలతో విదేశాల్లో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులను వదిలి దూరంగా ఉండటం, పిల్లల పెంపకంలో బాధ్యతలు, సామాజిక ఒంటరితనం, పనిఒత్తిడితో తెలియని నిరాశ, నిస్పృహలు, మానసిక ఆరోగ్య సమస్యలు రావడం సాధారణమైంది. ఈ నేపథ్యంలో ‘వీధి అరుగు’ వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్‌ 18న ‘ఆనందమయమైన జీవితం - మానవసంబంధాలు’ అనే అంశంపై ఆన్‌లైన్‌లో సదస్సును ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కవి, రచయిత, ఇంపాక్ట్‌ ట్రైనర్‌ నండూరి వెంకట సుబ్బారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి వ్యక్తి సమర్థత, ఆనందం, సంతృప్తిలో మానవ సంబంధాలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ సంబంధాలను మెరుగుపరిచేందుకు స్వీయ, కుటుంబం, స్నేహితులు, పని ప్రదేశం, సమాజంతో సంబంధాలను అధ్యయనం చేయాలని సూచించారు. వీటిని అధ్యయనం చేయడం ద్వారా విభేదాలకు కారణాలు.. వాటిని సామరస్యంగా పరిష్కరించే మార్గాలను కనుగొనవచ్చని తెలిపారు. మానవ సంబంధాలపై తన అనుభవాన్ని ఉపయోగించి నండూరి సుబ్బారావు ఎన్నో విషయాలను సరళంగా చెప్పారు. డెన్మార్క్‌ నుంచి ప్రముఖ వ్యాఖ్యాత రాజ్‌కుమార్‌ కలువల హాజరై దీనికి అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు బోజెడ్ల, డా.వీరంరాజు, డా.లహరి సూరపనేని, రవిచంద్ర నాగభైరవ, సత్యనారాయణ కొక్కుల, రామకృష్ణ ఉయ్యూరు, లక్ష్మణ్‌, డా.విజయలక్ష్మి, వెంకట్‌, జగదీశ్‌, కె.నరసింహులు, బాలాజీ యాదవ్‌, రవితేజ గుబ్బ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు