గోకరాజుపల్లిలో తానా సేవా కార్యక్రమాలు విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న చైతన్య స్రవంతి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలంలోని గోకరాజుపల్లిలో తానా సేవా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.

Published : 22 Dec 2022 22:36 IST

వీరులపాడు: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న చైతన్య స్రవంతి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలంలోని గోకరాజుపల్లిలో తానా సేవా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. తానా అపలాచియన్‌ రీజియన్‌ సమన్వయకర్త నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రూ.6లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లు, దివ్యాంగులకు ట్రై సైకిల్స్‌, మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విచ్చేశారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వెంకటరమణ యార్లగడ్డ, చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్‌ సునీల్‌ పాంత్రాతో పాటు రాజ కసుకుర్తి, ఉమా కటికి, శ్రీనివాస్‌ కూకట్ల, శశాంక్‌ యార్లగడ్డ, ఠాగూర్‌ మల్లినేని, జోగేశ్వరరావు పెద్దిబోయిన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తానా అతిపెద్ద సంస్థ అని, అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు తానా చేస్తున్న కృషిని వివరించారు. అమెరికాలో చిన్నారులకు తెలుగు భాష నేర్పించేందుకు తానా పాఠశాలను ఏర్పాటు చేశామని, తెలుగు కళల పరిరక్షణకు వీలుగా అమెరికాలో నిర్వహించే కార్యక్రమాల్లో ఇక్కడి కళాకారులకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో తానా చైతన్య స్రవంతి ద్వారా రైతులకు, ఇతరులకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు. పలువురు తానా నాయకులు మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడినా జన్మభూమికి ఏదైనా సేవ చేయాలన్న సంకల్పంతో తానా ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని