డాక్టర్‌ సుందరనాయుడికి తానా సేవా పురస్కారం

పౌల్ట్రీ పరిశ్రమ పితామహులు, బాలాజీ హేచరీస్‌ అధినేత దివంగత డాక్టర్‌ వి.సుందరనాయుడు పౌల్ట్రీ రంగానికి అందించిన విశేష సేవలు, చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఆయన తరఫున నెక్‌ రమేష్‌బాబును ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రముఖులు సత్కరించారు.

Updated : 30 Dec 2022 10:33 IST

ఆయన తరఫున నెక్‌ రమేష్‌కు సత్కారం
చిత్తూరు జిల్లాలో సేవా కార్యక్రమాలు

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పౌల్ట్రీ పరిశ్రమ పితామహులు, బాలాజీ హేచరీస్‌ అధినేత దివంగత డాక్టర్‌ వి.సుందరనాయుడు పౌల్ట్రీ రంగానికి అందించిన విశేష సేవలు, చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఆయన తరఫున నెక్‌ రమేష్‌బాబును ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రముఖులు సత్కరించారు. తానా ఆధ్వర్యంలో జిల్లాలోని బంగారుపాళ్యం, చిత్తూరులో గురువారం వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన తానా కళోత్సవంలో సేవాస్రష్టలైన ఎనిమిది మంది ప్రముఖుల్ని సత్కరించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, సైకిళ్లు, రైతులకు వ్యవసాయ పరికరాలు, మహిళలకు కుట్టుమిషన్లను అందించారు. 11 మంది ఆదర్శ రైతుల్ని సత్కరించారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరి మాట్లాడారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని