హ్యూస్టన్‌లో ఘంటసాల వర్ధంతి.. నివాళులర్పించిన ప్రవాసులు

గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి కార్యక్రమాన్ని అమెరికాలోని టెక్సాస్ రాష్త్రం హ్యూస్టన్‌లో నిర్వహించారు. 

Published : 13 Feb 2023 14:04 IST

గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి కార్యక్రమాన్ని అమెరికాలోని టెక్సాస్ రాష్త్రం హ్యూస్టన్‌లో నిర్వహించారు. ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ (GSKI) న్యూజెర్సీ ఆధ్వర్యంలో అన్నా మధుసూదనరావు అద్యక్షతన ఫిభ్రవరి 11న స్థానిక సంగం చెట్టినాడ్ రెష్టారెంట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. సాయిదత్తపీఠం శివ విష్ను టెంపుల్ ఛైర్మన్ రఘుశర్మ శంకరమంచి వేదమంత్రాల ఉచ్ఛారణతో జ్యోతి వెలిగించి ప్రార్థనా గీతాలతొ ప్రారంభమైన సభ ఆద్యంతమూ జనరంజకంగా సాగింది.

ఘంటసాల ఆలపించిన భగవద్గీత శ్లోకాలను, భక్తి గీతాలను, లలిత గీతాలను, పద్యాలను, మధుర గీతాలను రవి మరింగంటి, రాజ రాజేశ్వరి కలగా, కృష్ణ కీర్తి, హర్ష శిష్టా, దీప్తి, లాస్య, శ్రీకన్, GSKI సభ్యులు గానం చేసి.. ఘంటసాలకు ఘన నివాళి అర్పించారు. సత్యప్రియ బృందం ఘంటసాల పాటలకు చేసిన నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది.

GSKI న్యూజెర్సీ అడ్వైజర్‌ రఘు శర్మ శంకరమంచి, సభ్యురాలు సుజాత వెంపరాల, న్యూజెర్సీ మాజీ అసెంబ్లీ సభ్యులు ఉపేంద్ర చివుకుల ప్రత్యేకంగా ఈ సభలో పాల్గొని సభికులకు తమ సంస్థ గురించి తెలియజేశారు. GSKI హ్యూస్టన్‌ సభ్యుడు రవి మరింగంటి ఆధ్వర్యంలో ఈ సభ విజయవంతంగా జరిగింది. 

ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన తెలుగు భవనం శ్రీరాజ్ పసల, తెలంగాణ అసోసియేషన్ గ్రేటర్ హ్యూస్టన్‌ ఆధ్యక్షులు నారాయణ్ రెడ్డి, ఆశా జ్యోతి దేవకి, రాంబాబు కట్టా తదితరులు GSKI చేస్తున్న కార్యక్రమాలను  ప్రశంసించారు. ఘంటసాల వర్ధంతిని శ్రద్దతో నిర్వహించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ GSKI ప్రెసిడెంట్‌ అన్నా మధు, రవి మరింగంటి కృతఙ్ఞతలు తెలియజేశారు. ‘తెలుగు భాషకు వరం.. ఘంటసాల స్వరం’ అన్న నినాదంతో ముందుకు సాగుతూ.. తెలుగు భాషను ముందు తరాలకు పదిలంగా అందించడమే తమ లక్ష్యమని GSKI సభ్యులు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని